Begin typing your search above and press return to search.

కేసీఆర్ రేవంత్ ఫేస్ టూ ఫేస్ అక్కడేనట..ఈసారి కన్ ఫర్మ్ !

రెండేళ్ళ పాటు సైలెంట్ గా ఉన్నాను. ఇక ఆగేది లేదు, తగ్గేది అంతకంటే లేదు అని రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించారు.

By:  Tupaki Desk   |   25 Dec 2025 3:00 PM IST
కేసీఆర్ రేవంత్ ఫేస్ టూ ఫేస్ అక్కడేనట..ఈసారి కన్ ఫర్మ్ !
X

రెండేళ్ళ పాటు సైలెంట్ గా ఉన్నాను. ఇక ఆగేది లేదు, తగ్గేది అంతకంటే లేదు అని రీసెంట్ గా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించారు. ఇక జనం లోకి వెళ్తాం, తేల్చుకుంటామని కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణాలో మూడు భారీ సభలను కూడా కొత్త ఏడాది మొదట్లోనే నిర్వహించాలని కూడా ఆయన నిర్ణయించారు. కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని జనం మధ్య నుంచే బిగ్ సౌండ్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అంతే కాకుండా నీరు అన్నది సెంటిమెంట్ కాబట్టి నీటి నుంచే నిప్పులు పుట్టించాలని కూడా భారీ వ్యూహ రచన చేస్తున్నారు.

అక్కడ కాదు అంటూ రేవంత్ :

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీడియా సమావేశం మీద గత రెండు రోజులుగా తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. కృష్నా నది జలాల విషయంలో తెలంగాణకు ఎవరు న్యాయం చేస్తున్నారు ఎవరు అన్యాయం చేశారు అన్నది అసెంబ్లీ వేదికగానే తేల్చుకుందామని రేవంత్ రెడ్డి కేసీఆర్ కి భారీ సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కావాల్సివస్తే అన్ని రోజులు పొడిగిస్తామని ఆయన హామీ ఇస్తున్నారు. అక్కడ ఎవరి వాదన ఏమిటో వినిపించుకోవచ్చు అని సూచిస్తున్నారు.

కేసీఆర్ రెడీనా :

మరి ఈ సవాల్ మీద కేసీఆర్ వైపు నుంచి బీఆర్ఎస్ వైపు నుంచి ఇప్పటికైతే ఏ విధమైనా సమాచారం అయితే రాలేదు, అసెంబ్లీ వింటర్ సెషన్ కి కేసీఆర్ హాజరవుతారా అనంది అయితే సస్పెన్స్ గానే ఉంది. అయితే తెలంగాణా ప్రజల ఆలోచనలతో పాటు బీఆర్ఎస్ వర్గాలు సైతం కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి నిలదీస్తేనే బాగుంటుంది అన్నది ఉంది. దాంతో పాటుగా కేసీఆర్ ఇక రెండేళ్ల సమయం అయిపోయింది చూస్తూ ఊరుకోను అని అంటూ వస్తున్నారు. దాంతో ఆయన ఆలోచనలకు సలహా సూచనలను జనంలోనే కాదు చట్ట సభలల ద్వారా కూడా వెల్లడించాలని అంతా కోరుకుంటున్నారు. మరి దీని మీద అయితే బీఆర్ఎస్ లో తర్జన భర్జన జరుగుతోంది అని అంటున్నారు.

29 నుంచి సమావేశాలు :

ఇక చూస్తే తెలంగాణా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి నిర్వహించనున్నారు. అయిదారు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరు మీదనే చర్చ సాగుతోంది. అయితే నదీ జలాలలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం అలాగే పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పధకం విషయంలో డీపీఆర్ ని కేంద్రం వెనక్కి పంపించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవడం మీదనే బీఆర్ఎస్ తన అజెండాగా చేసుకుని సభలో చర్చిస్తుందని అంటున్నారు. ఇక కేసీఆర్ సభకు హాజరైతే మాత్రం ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ తోనే సభలో బీఆర్ఎస్ వాదన వినిపిస్తారు అని అంటున్నారు. అయితే పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తుందా అన్నదే చర్చగా ఉంది మరో వైపు చూస్తే ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరు అయ్యే విషయంలో మాత్రం ఒక స్పష్టత రావాల్సి ఉన్నా ఆయన హాజరు అయితేనే బాగుంటుందని అంతా అంటున్నారు. కేసీఆర్ కూడా హాజరయ్యేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ఈసారి వింటర్ సెషన్ హీట్ పుట్టించడం ఖాయమని అంటున్నారు.