బీఆర్ఎస్.. పతనమే తప్ప.. ఉత్థానమెరుగని రాజకీయం!
ఆ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు. ఇలా రెండు ఎన్నికల్లో `టీఆర్ ఎస్`పేరుతో ఆయన రాజకీయాలు చేశారు. ప్రజలను ఓట్లు కూడా అభ్యర్థించారు.
By: Garuda Media | 13 April 2026 10:00 PM ISTతెలంగాణ రాష్ట్రసమితి(టీఆర్ ఎస్) పార్టీని ఏర్పాటు చేసి.. 2001 నుంచి 2022 వరకు ఉత్థాన దిశగా నడిపించిన ఆ పార్టీ సుప్రీం.. మాజీ సీఎం కేసీఆర్.. 2022లో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సాధన అనంతరం.. 2014లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన ఆయన.. 2018లో అనూహ్యంగా మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు. ఇలా రెండు ఎన్నికల్లో `టీఆర్ ఎస్`పేరుతో ఆయన రాజకీయాలు చేశారు. ప్రజలను ఓట్లు కూడా అభ్యర్థించారు.
కానీ.. రెండో సారి అధికారంలోకి వచ్చే సరికి.. కేసీఆర్ ఊహలు.. అంచనాలు మారిపోయాయి. ఇక,తనకు తిరుగులేదని భావించారు. తెలంగాణ ఏముంది.. ఇది ఎప్పటికీ తమకేసొంతమని.. కేంద్రంలో అధికారంలో దక్కించుకుందామని పేకమేడలు కట్టుకున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సహా.. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఈశాన్యరాష్ట్రం మిజోరాం, అస్సాం.. ఇలా అనేక రాష్ట్రాల్లో పర్యటించి.. జాతీయస్థాయిలో తృతీయ పక్షం ఏర్పాటుకు ప్రయత్నాలు చేశారు. ఇలా ప్రారంభమైన.. ఆయన జాతీయ రాజకీయ వ్యవహారం.. టీఆర్ ఎస్‌ను.. బీఆర్ ఎస్(భారత రాష్ట్రసమితి)గా మార్చేసింది.
తద్వారా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసి.. తాను ప్రధాని కావాలని అనుకున్న మాట వాస్తవం. కానీ.. విధి ఎంత చిత్రమైం దంటే.. టీఆర్ఎస్‌గా ఉన్నంత వరకు నిజానికి కేసీఆర్‌కు ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఏనాడూ తిరుగు లేదన్నదివా స్తవం. అంతేకాదు.. ఆయన మాట కూడాచెల్లుబాటు అయింది. కానీ..ఏనాడైతే.. ఆయన టీఆర్ ఎస్‌ను బీఆర్ ఎస్‌గా మార్పు చేశారో.. ఇక, అప్పటి నుంచి కేసీఆర్‌కు పతనం ప్రారంభమైందని. సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. బీఆర్ ఎస్ గా మారిన తదుపరి రెండు మాసాల్లోనే కుమార్తె కవిత జైలు పాలయ్యారు.
కేసీఆర్ కుటుంబాన్ని లిక్కర్ కేసు చుట్టుముట్టింది. ఇక, కేంద్రంపై యుద్ధాన్నిచేయాల్సి వచ్చింది కూడా ఆ తర్వాతే. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి స్వయంగా అప్పటి సీఎంగా కేసీఆర్ ఇందిరా పార్కువద్ద నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక, పార్టీపై బీజేపీ పంజా కూడా విసిరింది. ఇదే `మొయినాబాద్ ఫామ్ హౌస్ ఆపరేషన్`గా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఇక, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం.. అధికారం కోల్పోవడం.. తెలిసిందే. అదేసమయంలో లోక్‌సభ ఎన్నికల్లో 2024లో బీఆర్ ఎస్ అడ్రస్సే గల్లంతైంది.
ఇక, సొంత కుమార్తె కవిత తిరుగుబావుటా కూడా కేసీఆర్‌ను కలవరానికి గురి చేసింది. అంతేకాదు.. నమ్మి నెత్తిన పెట్టుకున్న అనేక మంది నాయకులు పార్టీకి దూరమయ్యారు. ఇలా.. టీఆర్ ఎస్‌గా ఉన్న కేసీఆర్ ఒక ద్విగుణీకృత వెలుగు వెలిగితే.. బీఆర్ ఎస్ గా మారిన తర్వాత.. పతమే తప్ప.. ఉత్థానమెరుగని నాయకుడిగా నిలిచిపోయారన్నది వాస్తవం. ప్రస్తుతం బీఆర్ ఎస్‌ను టీఆర్ ఎస్‌గా మార్చాలని ప్రయత్నిస్తున్నామంటూ..కేటీఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో బీఆర్ ఎస్-టీఆర్ ఎస్ ప్రస్థానాలను ప్రస్తావించడమే ఈ కథనం ఉద్దేశం.
