కేసీఆర్ కి అలా జరిగిందేమో... సరిపోయిందా ?
జరిగిన ఒప్పందాలు గ్రౌండ్ కాకపోవడం అన్నది కేసీఆర్ సీఎం గా ఉండగా జరిగిందేమో అని కందుల దుర్గేష్ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు.
By: Satya P | 22 Dec 2025 10:00 PM ISTబీఆర్ఎస్ అధినేత తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ చాలా కాలానికి మీడియా ముందుకు వచ్చారు. ఆయన కాంగ్రెస్ పభుత్వాన్ని తూర్పారా పట్టారు. పనిలో పనిగా ఏపీలో చంద్రబాబు మీద కూడా హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి కేసీఆర్ కి ఆ అవసరం లేదు కానీ ఎందుకో ముగ్గులోకి బాబుని లాగారు. అయితే కేసీఆర్ ఏమి చేసినా అందులో వ్యూహం ఉంటుంది. రేవంత్ రెడ్డికి బాబు గురువు అంటూ ఆయనకు తెలుగు బంధాన్ని ఆంధ్రా సెంటిమెంట్ ని దట్టించే ప్రయత్నంలో భాగమే ఈ విమర్శలు అని అంతా విశ్లేషిస్తున్న నేపథ్యం ఉంది. అందుకే ఉమ్మడి ఏపీ సీఎం గా బాబు ఉన్ననాటి రోజుల నుంచి విభజన ఏపీలో బాబు నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల దాకా కేసీఆర్ చెప్పుకొచ్చారు. బాబు నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సుల వెనక ఏ ఒప్పందాలు లేవని పెట్టుబడులే రావని తేల్చేశారు. ఇక లోగుట్టు ఏమిటన్నది తనకు తెలిసిన తీరులో వివరించారు.
వాళ్ళే సంతకాలు :
ఏపీలో సీఎం చంద్రబాబు పెట్టుబడుల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూంటారు. అయితే పేరుకే పెట్టుబడుల హంగామా కానీ ఒప్పందాలు ఎవరూ చేసుకోలేదని, ఆయా హొటళ్ళలో సర్వర్లు సప్లయర్స్ సంతకాలు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టినవారే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్షల కోట్ల పెట్టుబడులు అని 2014 నుంచి చెబుతున్న బాబు అందులో పదివేల కోట్లైనా ఈ రోజుకు తెచ్చారా అని కూడా ఆయన ప్రశ్నిస్తూ బాబుని కార్నర్ ని చేశారు. ఇదంతా ఎందుకు అంటే రేవంత్ రెడ్డి కూడా ఇదే నెలలో గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహించారు. లక్షల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. దాంతో గురువు బాబు వీటిని మొదలెట్టారని శిష్యుడు అదే హడావుడి చేస్తున్నారు అన్నట్లుగా సెటైర్లు పేల్చారు. అయితే కేసీఆర్ బాబు మీద చేసిన ఈ కామెంట్స్ టీడీపీ నుంచి సాధారణంగా రియాక్షన్ రావాలి. కానీ అనూహ్యంగా జనసేన స్పందించింది. ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కేసీఆర్ కామెంట్స్ ని తప్పు పడుతూ ఒక విధంగా గాలి తీసేసే ప్రయత్నం చేఅశారు అని అంటున్నారు.
కేసీఆర్ కి జరిగిందేమో :
జరిగిన ఒప్పందాలు గ్రౌండ్ కాకపోవడం అన్నది కేసీఆర్ సీఎం గా ఉండగా జరిగిందేమో అని కందుల దుర్గేష్ గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. ఆయన ఏదో విమర్శించాలని మాట్లాడుతున్నారు తప్పించి అందులో మ్యాటరే లేదని తేల్చేశారు. పైగా ఏపీలో జరిగిన ప్రతీ ఒప్పందం వెనక పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. మొత్తానికి కేసీఆర్ ఆర్భాటంగా చేసిన వ్యాఖ్యలకు జనసేన మంత్రి ధీటుగా స్పందించడమే కాదు గులాబీ బాస్ కి షాక్ ఇచ్చారని అంటున్నారు.
బాబుని తెస్తేనే :
అయితే కేసీఆర్ బాబుని ముగ్గులోకి లాగడం వెనక వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి బాబుకు మధ్య బంధం ఉందన్నది జనాలకు చెప్పాలన్నదే బీఆర్ఎస్ వ్యూహంగా చెబుతున్నారు. అలా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నంలో భాగమే ఈ విమర్శలు అని అంటున్నారు. అయితే ఈ విషయాలు తెలిసినందువల్లనే టీడీపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఈ మ్యాటర్ మీద పెద్దగా రియాక్ట్ కాలేదని అంటున్నారు. మొత్తానికి జనసేన మంత్రి స్పందించారు, మరి బీఆర్ఎస్ దీనిని ఎలా చూస్తుంది అన్నదే ప్రశ్నగా ఉంది.
