కేసీఆర్-కవితల మధ్య ఎంతెంత దూరం...?
కేసీఆర్ చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చినా.. ఆయన దన్నుతోనే రాజకీయంగా కవిత ఎదిగారు. కానీ, ఇటీ వల ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు.
By: Tupaki Desk | 13 Jun 2025 7:00 AM ISTచిన్నప్పుడు ''ఎంతెంత దూరం.. చాలా చాలా దూరం!'' అంటూ రైలాట ఆడుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ బీఆర్ ఎస్‌లోనూ ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది. కేసీఆర్‌ను దేవుడు అంటూ.. ఆయన చుట్టూ దయ్యాలున్నాయని వ్యాఖ్యానించిన బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై ఆమె తండ్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా.. చాలా చాలా దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆమె.. తండ్రిని కలుసుకునేందుకువెళ్లినా.. ఆయన కనీసం పలకరించలేదని వార్తలు వచ్చాయి.
గతంలో కేసీఆర్ ఎక్కడికి బయలు దేరినా.. తన కుమార్తెతో భుజానికి పార్టీ గుర్తును కట్టించుకునేవారు లేదా .. నుదిటన బొట్టు పెట్టించుకునేవారు. కానీ, తాజాగా కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యేం దుకు బయలు దేరే సమయంలో కవితను ఆయన కనీసం పట్టించుకోలేదు. అంతేకాదు.. కనీసం పన్నెత్తి కూడా పలకరించలేదు. దీంతో కేసీఆర్.. కవితకు .. మధ్య ఎంతెంత దూరం పెరుగుతోందంటే.. చాలా చాలా దూరమే పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
కేసీఆర్ చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చినా.. ఆయన దన్నుతోనే రాజకీయంగా కవిత ఎదిగారు. కానీ, ఇటీ వల ఆధిపత్య ధోరణి ప్రదర్శించారు. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ కండువాను కూడా పక్కన పెట్టారు. సహ జంగా కేసీఆర్ తనను ఏమన్నా.. కొంత మేరకు సహిస్తారు కానీ.. పార్టీ కండువాను తృణీకరిస్తే.. మాత్రం ఆయన అస్సులు సహించరు. బహుశ .. కవిత విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందన్న భావన వ్యక్తమవు తోంది. కవిత 'డియర్ డాడీ' లేఖ తర్వాత.. నిర్వహించిన ప్రెస్ మీట్లు వివాదమయ్యాయి.
ఆ తర్వాత. బయటకు వచ్చినప్పుడు కూడా.. బీఆర్ ఎస్ కండువా కప్పుకోలేదు. ఈ పరిణామాలకు తోడు దెయ్యాలంటూ వ్యాఖ్యానించడం కూడా కేసీఆర్‌ను తీవ్రంగా కుదిపేసింది. కేసీఆర్ నాయకత్వాన్ని ఆమె నేరుగా ప్రశ్నించకపోయినా.. అంతే చేశారన్న గుసగుస కూడా వినిపిస్తోంది. ఆడబిడ్డకు అన్యాయం చేస్తారా? అంటూ.. ప్రశ్నలు కూడా గుప్పించారు. వెరసి ఇవన్నీ.. కేసీఆర్ మదిలో తిరుగుతూనే ఉన్నాయి. అందుకే.. ఏరికోరి కుమార్తె ఇంటికి వచ్చినా..ఆయన కనీసం పలకరించకుండానే వెళ్లిపోయారని పార్టీలో చర్చ నడుస్తోంది.
