కేసీఆర్-జగన్.. పరస్పర అజెండా ఒక్కటేనా..!
ఇక, వైసీపీ అధినేత కూడా.. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు.
By: Tupaki Desk | 15 April 2025 8:30 AM ISTతెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌లు.. ఒకే అ జెండాను ఫాలో అవుతున్నారా? పరస్పరం కలిసి.. ఒకే దిశగా పయనం చేస్తున్నారా? అంటే.. ఔననే అం టున్నారు పరిశీలకులు. ఇద్దరూ కూడా.. అధికారం ఉంటే తప్ప.. అసెంబ్లీలో అడుగు పెట్టనని పరోక్షంగా చెబుతున్నారు. అంతేకాదు.. ఇద్దరూ కూడా.. అదే పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగా గెలిచినా.. ఆయన పార్లమెంటుకు వెళ్లకుండా.. తెలంగాణ కోసం రోడ్డెక్కారు.
ఇక, ఏపీలోనూ.. 2014-19 మధ్య నుంచి ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ కూడా.. సభకు వెళ్లకుండా.. వ్యవహరిస్తున్నారు. ఈ రెండు విషయాల్లోనూ ఇద్దరి నేతల మధ్య సారూప్యత ఉంది. తాజాగా తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయారు. దీంతో ఆయన వివిధ కారణాలు చెబుతూ.. సభకు డుమ్మా కొడుతున్నారు. ఎక్కడా ఆయన సభకు వెళ్లడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు వెళ్లి వచ్చేశారు. తర్వాత.. కనిపించలేదు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ సభ ఉంది.
ఇక, వైసీపీ అధినేత కూడా.. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ఈ రెండు పరిణామాలు కూడా.. దాదాపు సారూప్యతతోనే ఉన్నాయి. మరి భవితవ్యం ఏంటి? అనేది ప్రశ్న. ఈ విషయంలోనూ ఇద్దరూ కూడబలుక్కుంటున్నట్టుగా.. వ్యవహరిస్తున్నారు. నేరుగా సంప్రదింపులు చేయక పోయినా.. వారు వ్యవహరిస్తున్నతీరు మాత్రం అలానే ఉంది. వైసీపీ అధినేత జగన్ ప్రజల్లోకి త్వరలోనే వస్తారని ప్రచారం జరుగుతోంది.
అయితే.. అది ఎప్పుటిప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఇక, కేసీఆర్ ఈ నెల 27న జరిగే పార్టీ వజ్రోత్సవ సభ ద్వారా.. కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. జగన్ విషయంలో ఈ కార్యాచ రణకు ఇంకా రెండేళ్ల సమయం పట్టే ఛాన్స్ ఉంది. అప్పటికి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుందని అంచనా వేసుకుంటున్నారు. అప్పటి వరకు మౌనంగా ఉండి.. పార్టీని కాపాడుకునేందుకు ఇరువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సో.. మొత్తంగా చూస్తే.. ఇద్దరు స్నేహితులు కూడా.. ఒకే అజెండాను ఫాలో కావడం గమనార్హం.