మోడీ వచ్చి వెళ్ళాక కేసీఆర్ చేస్తోంది ఏంటంటే ?
తెలంగాణాకు మోడీ వచ్చి సగం రోజు అక్కడే ఉండి చేసిన రాజకీయ కలకలం అంతా ఇంతా కాదు, సీఎం రేవంత్ రెడ్డిని తమతో కలవమని బంపర్ ఆఫర్ ఇచ్చారు.
By: Satya P | 13 May 2026 8:30 AM ISTతెలంగాణాకు మోడీ వచ్చి సగం రోజు అక్కడే ఉండి చేసిన రాజకీయ కలకలం అంతా ఇంతా కాదు, సీఎం రేవంత్ రెడ్డిని తమతో కలవమని బంపర్ ఆఫర్ ఇచ్చారు. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు దీని మీద విశ్లేషించి రచ్చ చేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్డీయే బలోపేతం మీద మోడీ మిత్రులతో చర్చించారు అన్న వార్తలతో అటు ఆంధ్రాలో వైసీపీ ఇటు తెలంగాణాలో బీఆర్ఎస్ కూడా ఉలిక్కిపడి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లోకి దిగిపోతున్నాయి.
సుదీర్ఘ భేటీతో :
కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ లో తాజాగా బీఆర్ఎస్ సీనియర్లతో అతి ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఆరు గంటల సేపు ఈ మీటింగ్ సాగింది అని అంటున్నారు. ఈ మీటింగ్ వేరీ సీరియస్ గానే సాగింది అని అంటున్నారు. ఏకంగా బీఆర్ఎస్ ని గ్రౌండ్ నుంచి టాప్ లెవెల్ వరకూ కొత్త రూపుతో షేపుతో తీర్చిదిద్దాలని కేసీఆర్ పార్టీ వర్గాలకు దిశా నిర్దేశం చేశారని అంటున్నారు బీఆర్ఎస్ విషయంలో పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులు చేపట్టాలని కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై కూడా లోతైన చర్చ సాగింది అని అంటున్నారు.
గ్రాస్ రూట్ నుంచే :
బీఆర్ఎస్ ని పూర్తిగా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధినాయకుడు కేసీఆర్ పార్టీ వర్గాలకు సూచించారు అని అంటున్నారు. గతానికి భిన్నంగా తెలంగాణా రాజకీయం మారుతోంది అని బీఆర్ఎస్ పెద్దలు గుర్తించారు. బీజేపీ తెలంగాణాలో అధికారం విషయంలో గట్టి పట్టుదలతో ఉందని కూడా అర్ధం అవుతోంది. మోడీ బహిరంగ సభలో అయితే వచ్చేది బీజేపీనే అని స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. బీజేపీ కనుక ఒక చోట అధికారంలోకి రావాలనుకుంటే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చాలా ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటుంది. దానికి తాజా ఉదాహరణ పశ్చిమ బెంగాల్ లో ఆ పార్టీ ఘన విజయం. అసలు ఓటమి లేదు అనుకున్న మమతా బెనర్జీ ఓటమి పాలు అయ్యారు. దాంతో అంతకంటే బలమైన ప్రాంతీయ పార్టీల నేతలు ఎవరూ లేరని అంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో అలెర్ట్ అవుతోంది అని అంటున్నారు.
కమిటీలతో దూకుడు :
ఇక బీఆర్ఎస్ ని బూత్ లెవెల్ నుంచి గ్రామ వార్డు స్థాయి నుంచి కమిటీలతో నింపాలని నిర్ణయించారు. అలాగే నియోజకవర్గం స్థాయి జిల్లా స్థాయి వరకూ కూడా బలమైన సమర్ధులైన నాయకులతో పార్టీని పటిష్టం చేయాలని కూడా నిర్ణయించారు ఇక పార్టీ శ్రేణులలో సరికొత్త ఉత్సాహం నింపాలని రానున్న రోజులలో నేతలంతా జనంలో ఉంటూ బీఆర్ఎస్ ని పరుగులు పెట్టించాలని కూడా తీర్మానించారని అంటున్నారు. జీహెచ్ఎంసీ సహా ఏ ఎన్నికలు జరిగినా విజయమే పరమాధిగా పార్టీ పోరాడాలని కూడా నిర్ణయించారు. మొత్తానికి 2028 ఎన్నికలకు బీజేపీ రెడీ అని మోడీ గట్టిగా చెప్పి వెళ్లారు. దాంతో బీఆర్ఎస్ కూడా జోరు చేస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో బీఆర్ఎస్ స్పీడ్ ఏ విధంగా ఉంటుందో.
