రేవంత్ చక్రం.. కేరళం.. 'కేసీ'కేనా?
కేరళం రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీవిజయదుందుభి మోగించింది.
By: Garuda Media | 6 May 2026 2:37 PM ISTకేరళం రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీవిజయదుందుభి మోగించింది. దాదా పు 10 సంవత్సరాల ఎల్‌డీఎఫ్ పాలనకు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాలనకు కూడా ముగింపు పలుకుతూ.. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి మద్దతుగా నిలిచారు. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళంలో కాంగ్రెస్ కూటమి 100 సీట్లకు పైగా దక్కించుకుంది. దీంతో పినరయి విజయన్ రాజీనామా చేయడం.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం రెడీ కావడం తెలిసిందే.
ముఖ్యమంత్రి పీఠం ఎవరికి?
సాధారణంగానే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పీఠం కోసం.. పోటీ కొనసాగుతుంది. అనేక మంది సీని యర్ నాయకులు ఈ జాబితాలో ముందున్నారు. ఇలాంటి వారిలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ సహా.. కీలక నేత సతీశన్, ఎంపీ శశిథరూర్‌వంటి హేమాహేమీలు కూడా పోటీపడు తున్నా రు. ఇక, యూడీఎఫ్ మిత్ర పక్షం ఆల్ ఇండియా ముస్లిం లీగ్(ఏఐఎంఎల్).. తన మద్దతు సతీశన్‌కేనని చెబుతోంది. ఈయన 2001 నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా విజయం దక్కించుకున్నారు.
పైగా పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. మరోవైపు కేసీ వేణుగోపాల్ కూడా తానే ముఖ్యమంత్రినంటూ ప్రకటించుకుంటున్నారు. పార్టీని ముందుండి నడపడంలోనూ.. ఎన్నికల వేళ పార్టీని బలోపేతం చేయడంలోనూ ఆయన సేవలను ఎవరూ కాదనలేరు. ఇక, శశి థరూర్ వ్యవహారం కూడా పార్టీలో చర్చకు వచ్చినా.. ఆయనకు అదిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవచ్చు. మరో వైపు ఇతర నేతల ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.
రంగంలోకి రేవంత్..
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఈ స్థాయి విజయానికి కారణం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనన్న ప్రచా రం జరుగుతోంది. ఆయన ఎన్నికల సమయంలోఅనుసరించిన వ్యూహాలు.. అప్పటి సీఎం విజయన్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ పుంజుకుందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పు డు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ.. రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో రేవంత్‌కే ప్రాధాన్యం లభిస్తే.. ఆయన ఓటు కేసీ వేణుగోపాల్‌కే ఉంటుందన్న చర్చ కేరళలో జోరుగా సాగుతోంది. అయితే.. దీనిని సతీశన్ వర్గం తీవ్రంగా విభేదిస్తోంది. పార్టీని అన్ని విధాలా కాపాడిన తననే సీఎంను చేస్తారన్న నమ్మకం ఉందని సతీశన్ చెబుతున్నారు. ఈయన `పెరవూరు` నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
