Begin typing your search above and press return to search.

కవితలో ఉక్రోషం బయటపడుతోందా ?

దాన్ని కవిత తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాక ఎదురుదాడి మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:56 AM GMT
కవితలో ఉక్రోషం బయటపడుతోందా ?
X

రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్లను కేసీయార్ ప్రకటించిన తర్వాత కల్వకుంట్ల కవితలో ఉక్రోషం బయటపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను అకారణంగా ఆడిపోసుకుంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవటానికి కాంగ్రెస్, బీజేపీనే కారణమంటు రెచ్చిపోయారు. మహిళా బిల్లు పార్లమెంటులో పాస్ కాకపోవటానికి కాంగ్రెస్, బీజేపీలో కారణమంటు మండిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన అరెస్టు తప్పదని కవితకు అర్ధమైపోయింది.

అందుకనే అరెస్టును తప్పించుకోవటానికి సడెన్ గా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లంటు చాలా హడావుడిచేశారు. ప్రతిపక్షాల్లోని ఎంపీలందరినీ పార్లమెంటు దగ్గరకు పిలిపించి నానా రచ్చచేశారు. అదంతా అరెస్టు నుండి తప్పించుకునేందుకే అని అప్పట్లోనే చాలామంది ఎద్దేవాచేశారు. సరే సీన్ కట్ చేస్తే మొన్ననే కేసీయార్ అభ్యర్ధులను ప్రకటించారు. 119 నియోజకవర్గాలకు గాను కేసీయార్ ఒకే జాబితాలో 115 మందిని ప్రకటించేశారు.

కేసీయార్ ప్రకటించిన జాబితాలో ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్లిచ్చారు. నిజానికి కవిత చెప్పే మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారమైతే కేసీయార్ టికెట్లు ఇవ్వాల్సింది 39 మంది మహిళలకు. ఇచ్చింది కేవలం ఏడుగురికి మాత్రమే. అంటే కవిత తండ్రి కేసీయార్ కూడా మహిళా బిల్లును ఆచరించలేదు. ఇదే విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ నేతలు గుర్తుచేసి ఎద్దేవాచేశారు. పార్లమెంటులో రిజర్వేషన్ పాస్ అవ్వాలని, అమలవ్వాలని డిమాండ్ చేస్తున్న కవిత తమ పార్టీలో మహిళలకు 39 టికెట్లు ఎందుకు ఇవ్వలేకపోయారంటు హేళనచేశారు.

దాన్ని కవిత తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాక ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ హయాంలో బిల్లు ఎందుకు పాస్ కాలేదని, బీజేపీ ఎందుకు మహిళా బిల్లును తొక్కిపెడుతోందని నిలదీస్తున్నారు. నిజానికి కవిత ప్రశ్నల్లో పసలేదు. ఎందుకంటే కాంగ్రెస్ లేదా బీజేపీ నేతలు మహిళా బిల్లు గురించి మాట్లాడటంలేదు. ఒక్క కవిత మాత్రమే చాలా ఓవర్ యాక్షన్ చేశారు. తాను చేసిన ఓవర్ యాక్షన్ గురించి గుర్తుచేస్తున్నారనే తట్టుకోలేక ఉక్రోషం పడుతున్నారు. అందుకనే వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలో అర్ధంకాక ఎదురుదాడి చేస్తున్నారు.