Begin typing your search above and press return to search.

ఇంకా కవిత జపమేనా ?

కల్వకుంట్ల కవిత జపాన్ని బీజేపీ నేతలు ఇంకా వదల్లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతు ఆరోపణలు రుజువైతే కవితకు జైలు తప్పదని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   29 Dec 2023 6:38 AM GMT
ఇంకా కవిత జపమేనా ?
X

కల్వకుంట్ల కవిత జపాన్ని బీజేపీ నేతలు ఇంకా వదల్లేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడుతు ఆరోపణలు రుజువైతే కవితకు జైలు తప్పదని ప్రకటించారు. ఇలాంటి ప్రకటనలు వినివిని జనాలకు విసుగొచ్చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీయార్ కూతురు కవిత ఆధారాలతో సహా ఇరుక్కున్నారని ఈడీ కోర్టులో చెప్పింది. నిందితులపై కోర్టులో ఫైల్ చేసిన చార్జిషీట్లు, రిమాండు రిపోర్టుల్లో చాలాసార్లు కవిత పేరును ఈడీ ప్రస్తావించింది.

అయితే కేసులో ఇన్వాల్వ్ అయిన చాలామందిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ కవితను మాత్రం టచ్ చేయలేదు. మూడుసార్లు విచారణ చేసినా కవితను మాత్రం అరెస్టుచేయలేదు. దాంతో నరేంద్రమోడీ-కేసీయార్ మధ్య జరిగిన లోపాయికారి ఒప్పందం కారణంగానే కవితను ఈడీ టచ్ చేయలేదని అప్పట్లో కాంగ్రెస్ పదేపదే అరోపణలు చేసింది. దానికి తోడు కేసీయార్ వైఖరి కూడా అందుకు దోహదంచేసింది. ఎలాగంటే అంతకుముందు వరకు మోడీపై పదేపదే ఆరోపణలు, విమర్శలు చేసిన కేసీయార్ లిక్కర్ స్కామ్ లో కేసు తర్వాత అసలు మోడీ గురించి మాట్లాడటమే మానుకున్నారు.

కేసీయార్ వైఖరి కారణంగానే మోడీ, కేసీయార్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని జనాలు కూడా నిర్ధారణకు వచ్చారు. సరే ఇదంతా చరిత్రగా మిగిలిపోయింది. ఈ కారణంగానే బీజేపీ గ్రాఫ్ ఎన్నికల్లో దారుణంగా పడిపోయింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత జనాలు కూడా లిక్కర్ స్కామ్, కవిత, ఈడీని మరచిపోయారు. అలాంటిది ఇపుడు సడెన్ గా అర్వింద్ మాట్లాడుతు కవిత అరెస్టు ఖాయమని మళ్ళీ మొదలుపెట్టారు.

లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అరెస్టుచేసేది లేదు, కవితను కోర్టులో ప్రవేశపెట్టేది లేదు, కోర్టు కవితకు రిమాండు విధించేది లేదని జనాలందరికీ అర్ధమైపోయింది. అందరికీ అర్ధమైపోయిన విషయాన్ని అర్వింద్ మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కవిత, లిక్కర్ స్కామ్ అంశం బీజేపీకి లాభిస్తుందని అనుకునేందుకు లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడని అంశం పార్లమెంటు ఎన్నికల్లో లాభిస్తుందా ?