Begin typing your search above and press return to search.

ఈడీ, సీబీఐ... కవిత కోసం రంగంలోకి మరో డిపార్ట్మెంట్!

ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటూ ఆమె ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. మరోపక్క సీబీఐ అధికారులు ఎంటరయ్యారు.

By:  Tupaki Desk   |   12 April 2024 10:33 AM GMT
ఈడీ, సీబీఐ... కవిత కోసం రంగంలోకి మరో డిపార్ట్మెంట్!
X

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కష్టాలు మరింత పెరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేయడం.. అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటూ ఆమె ఈడీ విచారణను ఎదుర్కొంటోన్నారు. మరోపక్క సీబీఐ అధికారులు ఎంటరయ్యారు.

ఇందులో భాగంగా... కవితను విచారించడానికి అనుమతి ఇవ్వాలంటూ కొద్దిరోజుల కిందటే సీబీఐ అధికారులు దాఖలు చేసుకున్న పిటీషన్‌ పై ఢిల్లీ రౌస్ అవెన్యూ న్యాయస్థానం సానుకూలంగా స్పందించి.. విచారణకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో... ఢిల్లీ మద్యం పాలసీలో సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత నుంచి సరైన సమాధానం లభించకపోవడం వల్లే అరెస్ట్ చేశారని అంటున్నారు!

ఈ నేపథ్యంలో... త్వరలో ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ కూడా కవిత విషయంలో ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో... వ్యవహారం మరింత సీరియస్ గా మారే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... కవితకు ఇప్పట్లే బెయిల్ రావడం కష్టమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుందని తెలుస్తోంది. ఈడీ, సీబీఐ చెరోవైపున ఆమెను విచారణ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. పైగా అటు కోర్టు కూడా అటు మద్యంతర బెయిల్, ఇటు రెగ్యులర్ బెయిల్ ని కూడా తిరస్కరిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు!

ఇలా ముప్పేట దాడి కొనసాగుతోన్న నేపథ్యంలో... లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకూ ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉండకపోవచ్చని అంటున్నారు.