Begin typing your search above and press return to search.

కేసీఆర్ కుటుంబం భయపడుతోందా...కవిత పోటీ చేయడంలేదు...!?

అనూహ్యంగా బీఆర్ ఎస్ తెలంగాణా ఎన్నికల్లో ఓడాక గులాబీ పార్టీలో ఏదో తెలియని గుబులు మొదలైంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 March 2024 9:30 AM GMT
కేసీఆర్ కుటుంబం భయపడుతోందా...కవిత పోటీ చేయడంలేదు...!?
X

కేసీఆర్ అంటే ఓటమి ఎరుగని వారు అని ఒకప్పుడు అంతా అనుకునేవారు. ఆయనకు ఎదురెళ్ళినా లేక ఆయన ఎవరికైనా ఎదురెళ్ళినా వారికి పరాజయమే అన్నది రాజకీయంగా అంతా చెప్పుకునే పరిస్థితి ఉండేది. ఒక విధంగా చెప్పాలీ న్యూ మిలీనియం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక పాతికేళ్ల పాటు తెలుగు రాజకీయాలను ప్రత్యేకించి తెలంగాణా రాజకీయాలను కేసీఆర్ విశేషంగా ప్రభావితం చేసిన వారుగా ఉన్నారు.

ఎన్నిక నుంచి ఎన్నిక ఇదే కేసీఆర్ విధానం. ఏ ఎన్నికకూ ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఎక్కడా భయపడిన సందర్భం లేదు. కానీ ఓడలు బళ్ళు అవుతాయన్న సామెత మాదిరిగా ఇపుడు అంతా గతం అయిపోయింది. అనూహ్యంగా బీఆర్ ఎస్ తెలంగాణా ఎన్నికల్లో ఓడాక గులాబీ పార్టీలో ఏదో తెలియని గుబులు మొదలైంది అని అంటున్నారు.

దాంతోనే ఎంపీ ఎన్నికల వేళ ఆ పార్టీలో అనేక చిత్రాలు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పూర్వ రూపం అయిన టీఆర్ఎస్ ని 2001లో పెట్టిన దగ్గర నుంచి ఎంపీ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఎపుడూ లేదు. కేసీఆర్ అయినా లేకపోతే ఆయన కుమార్తె కవిత అయినా ఎంపీ అభ్యర్ధులుగా పోటీ పడేవారు.

కానీ ఫస్ట్ టైం 2024 ఎన్నికల్లో మాత్రం కవిత పోటీకి దూరంగా ఉంటున్నారు. మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణాలో అభ్యర్ధుల ఎంపిక చేస్తున్న కేసీఆర్ కవిత పోటీ చేసే సీటుకు కూడా వేరే అభ్యర్ధులను ఎంపిక చేయడం చర్చనీయాంశం అవుతోంది.

ఇది నిజంగా ఆశ్చర్యకరం అని అంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అలాగే ప్రధాని మోడీకి వారి పార్టీలకు కేసీఅర్ కుటుంబం భయపడుతోందా అన్న చర్చ కూడా వాడిగా వేడిగా సాగుతోంది.

అటు చూస్తే దూకుడు మీద ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు చూస్తే హ్యాట్రిక్ పీఎం కావాలంటూ అందులో తెలంగాణా వాటా బీజేపీకి తేల్చడానికి వస్తున్న ప్రధాని మోడీ ఇలా ఈ ఇద్దరూ తమ పార్టీలతో సిద్ధంగా ఉండడంతో బీఆర్ఎస్ నుంచి కవిత పోటీకి దూరంగా ఉంటోందా అన్నది పెద్ద ఎత్తున తెలంగాణా వ్యాప్తంగా చర్చ సాగుతోంది.

ఇక చూస్తే కేసీఆర్ కుటుంబానికి అచ్చి వచ్చిన మెదక్ నుంచి అయినా కేసీఆర్ కుటుంబం ఎంచుకుని పోటీ చేయవచ్చు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ పోటీ చేస్తే గెలుస్తాం అన్న నమ్మకం ఉంటే పోటీకి ఎందుకు దిగడం లేదు అన్నది కూడా సందేహంగా ఉంది.

కవిత ఈసారి ఎంపీగా పోటీ చేస్తుంది అదే మెదక్ ఎంపీ సీటు అని కూడా అంతా అనుకున్నారు. తీరా చూడబోతే అక్కడ కూడా బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ డిసైడ్ అయ్యారు. మరి కవిత పోటీ చేయడం లేదు అంటే ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలి అన్నదే ఇపుడు సాగుతున్న చర్చ. నిజానికి చూస్తే ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం ఏదో ఒక చోటన పోటీ చేస్తే మొత్తం బీఆర్ఎస్ శ్రేణులకు నైతిక స్థైర్యం వస్తుంది.

ఇటీవల మొత్తం ఓడి పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్లిపోయిన పార్టీ శ్రేణులకు కూడా ఒక ధైర్యం వస్తుంది అని అంతా అనుకున్నారు. ఇక కవిత అంటే ఎంపీగా పోటీ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆమె పోటీకి దూరం అంటే బీఆర్ఎస్ కి ఎక్కడో ఏవో డౌట్లు ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది.

రాజకీయాలలో ఎదురు నిలిచి పోరాడడం అని నేర్పించిన కేసీఆర్ ఇపుడు తన రూట్ ని తానే మరచిపోయారా అన్నది కూడా సందేహంగా ఉంది. కేసీఆర్ అంటే దేనికీ వెరవరు, ఏటికి అయినా ఎదురీదుతారు అని ఉద్యమకాలంలో అనుకున్నారు. ఆ తరువాత పదేళ్ళ పాటు సీఎం గా అలాగే ఆయన శాసించారు. ఇపుడు ఒకే ఒక్క ఎన్నిక ఇలా ఎందుకు చేసింది అన్నదే చర్చ.

అయితే కేసీఆర్ కుటుంబం పోటీకి దిగకపోవడానికి కారణాలు ఉన్నాయని అంటున్నారు. అందులో వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. కవిత ఎక్కడైనా పోటీ చేస్తే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ కూడా అక్కడ ఫుల్ ఫోకస్ పెడతాయని ఓడించేందుకు పట్టుదలగా పనిచేస్తాయని ఆలోచించే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు అని అంటున్నారు.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారం కొండలా ఉంది. దానికి సాయం అన్నట్లుగా కేసీఅర్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మరోసారి ఓటమి పాలు అయితే అది పార్టీకి బిగ్ డ్యామేజ్ చేస్తుంది అని ఆలోచించే ఈ రిస్క్ కి వారు దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజం ఉందో.