Begin typing your search above and press return to search.

ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఆసక్తికర దినచర్య ఇదే!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 March 2024 5:04 AM GMT
ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఆసక్తికర దినచర్య ఇదే!!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో విచారణ సమయం మినహా కవిత కస్టడీలో ఏమి చేస్తున్నారు.. సమయాన్ని ఎలా గడుపుతున్నారు.. అసలు ఆమె దినచర్య ఎలా ఉంటుంది అనే విషయాలపై పలువురు ఆసక్తికనబరుస్తున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఆమె దినచర్య గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి!

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై, ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఆసక్తికర దినచర్య కొనసాగిస్తున్నారని తెలుస్తుంది! ఇందులో భాగంగా... ఆమె ప్రతీరోజు ఉదయం ధాన్యం చేస్తున్నారని.. మిగిలిన సమయంలో భగద్గీత పఠనంతో పాటు మరికొన్ని బుక్స్ చదువుతూ దినచర్యను కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో... నిన్న ఏకాదశి కావడంతో ఉపవాసం ఉన్నారని, ఈ క్రమంలో కేవలం పండ్లు మాత్రమే తీసుకున్నారని తెలుస్తుంది.

ఇలా స్వామీ సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని తెప్పించుకుని కవిత చదువుతున్నారని తెలుస్తుంది. పైగా అందులో తనకు నచ్చిన, కీలకమైన అంశాలను తన డైరీలో కూడా నోట్ చేసుకుంటున్నారని అంటున్నారు. ఇలా భగవద్గీతతో పాటు ఇండియన్ పొలిటికల్ లైఫ్ కు సంబంధించిన మరికొన్ని పుస్తకాలను కూడా తెప్ప్పించుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి సంబంధించిన బుక్స్ కూడా చదువుతున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర, ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన "కరుణానిధి ఏ లైఫ్" లతోపాటు శోభన కే నాయుడు రాసిన "రాం విలాస్ పాస్వాన్ ది వెదర్ మెన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్" పుస్తకాలను అడిగి తెప్పించుకుని చదువుతున్నారని.. వాటిలోని కీలక పాయింట్లను కూడా నోట్ చేసుకుంటున్నారని.. ఈ విధంగా విచారణ సమయం మినహా కవిత దినచర్య ఉంటుందని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... బుధవారం నాడు కవితను ఈడీ అధికారులు ఉదయం 10 గంటల నుంచి కొద్దిసమయం మాత్రం విచారించారని తెలుస్తుంది. ఇదే క్రమంలో లంచ్ బ్రేక్ తర్వాత కూడా అతికొద్ది సమయం మాత్రమే విచారించారని అంటున్నారు. మరోపక్క కవిత పీఏని, సిబ్బందిని కూడా విచారించారని, ఇందులో భాగంగా ఆమె సిబ్బందికి సంబంధించిన సుమారు 16 ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

మరోపక్క కస్టడీలో ఉన్న కవితను నాలుగో రోజు కూడా ఆమె అన్న కేటీఆర్ కలిశారు! అడ్వకేట్ మోహిత్ రావును వెంటబెట్టుకున్న కేటీఆర్... కవితను కలిసి సుప్రీంకోర్టులో ఈ కేసు నుంచి ఉపశమనం దొరికే అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నేడు కవిత తల్లి శోభను ఆమె కలవనున్నారు. ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి వచ్చిందని తెలుస్తుంది. ఇదే సమయంలో... కవిత అరెస్ట్ పై కేసీఆర్ మౌనంగానే ఉంటున్న సంగతి తెలిసిందే!!