Begin typing your search above and press return to search.

లిక్కర్ కేసులో నిందితురాలిగా కవిత... సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఇదే!

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Feb 2024 12:03 PM GMT
లిక్కర్ కేసులో నిందితురాలిగా కవిత... సీబీఐ నెక్స్ట్ స్టెప్ ఇదే!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది! ప్రధానంగా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ కుమార్తె కేంద్రంగా ఈ కేసు వ్యవహారం రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశం అయ్యేది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈసారి నిందితురాలిగా కవిత పేరు తెరపైకి వచ్చింది.

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవితను సీబీఐ నిందితురాలిగా పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా చార్జిషీట్‌ లో ఆమెను నిందితురాలిగా చేర్చింది దర్యాప్తు సంస్థ. ఈ క్రమంలో ఆమెకు ఇప్పటికే నోటీసులు జారీచేసిన సీబీఐ అధికారులు.. ఫిబ్రవరి 26న ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొన్నారు.

వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి కవితను దర్యాప్తు సంస్థల అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు! ఇందులో భాగంగా... గతంలో హైదరాబాద్‌ వచ్చి కవితను ఆమె ఇంట్లో సీబీఐ విచారించగా... ఈడీ అధికారులు మాత్రం రెండు సార్లు ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించారు! ఆ సమయంలో ఢిల్లీ కేంద్రంగా తీవ్ర రసవత్తరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి!

ఈ సమయంలో కవితను నిందితురాలిగా చేర్చడంతో వ్యవహారం ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంపై తీవ్ర ఆసక్తి నెలకొంది! కారణం... మహిళలను ఇంట్లోనే విచారించాలని వెసులుబాటు చట్టంలో ఉందంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే కవితకు నోటీసులు పంపిన సీబీఐ 26న విచారణకు హాజరుకావాలని సూచించింది.

కాగా... ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్‌ కి సంబంధించి ఏడోసారి నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని పేర్కొంది!