Begin typing your search above and press return to search.

క్రూయిజ‌ర్ కార్లపై అతి చేస్తే.. రేవంత్ కే న‌ష్టం: క‌విత‌

అయితే, ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇచ్చి.. వంద రోజుల తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని క‌విత చెప్పారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 8:35 AM GMT
క్రూయిజ‌ర్ కార్లపై అతి  చేస్తే.. రేవంత్ కే న‌ష్టం:  క‌విత‌
X

తెలంగాణ రాజ‌కీయాల‌ను కొన్ని రోజులుగా కుదిపేస్తున్న ల్యాండ్ క్రూయిజ‌ర్ కార్ల వ్య‌వ‌హారంలో తాజాగా బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య జోక్యం చేసుకున్నారు. ఈ కార్ల వ్య‌వ‌హారంపై అతి చేస్తే.. ముఖ్య‌మంత్రిరేవంత్‌రెడ్డి గౌర‌వానికే న‌ష్టం వ‌స్తుంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. ``ప్రభుత్వంలో ఉన్న వారి సెక్యూరిటీని అధికారులు చూస్తారన్నారు. అందులో భాగంగానే ల్యాండ్ క్రూయిజర్ కార్లు విజయవాడలో ఉంచినట్టున్నారు. దీన్ని ఇష్యూ చేయడం వల్ల ముఖ్యమంత్రి గౌరవమే తగ్గుతుంది. ఆయ‌న‌కే న‌ష్టం`` అని కవిత వ్యాఖ్యానించారు.

ఓట్ల తేడా ఇంతే!

ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న కాంగ్రెస్‌కు బీఆర్ ఎస్‌కు మ‌ధ్య కేవలం 1.7 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉందని క‌విత చెప్పారు. దీనిని బ‌ట్టి త‌మ‌కు భారీ డ్యామేజీ వ‌చ్చేసింద‌ని చెబుతున్న మాట వాస్త‌వం కాద‌న్నారు. త‌మ‌కు స్పీడ్ బ్రేక‌ర్ మాత్ర‌మేనని.. తిరిగి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పుంజుకుంటామ‌న్నారు. ప్ర‌స్తుతం కొత్త‌గా వ‌చ్చిన రేవంత్ ప్ర‌భుత్వాన్ని అన్ని కోణాల్లోనూ ప‌రిశీలిస్తామ‌న్నారు.

అయితే, ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇచ్చి.. వంద రోజుల తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని క‌విత చెప్పారు. కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించారు కాబట్టి బాధ్యతతో పని చేయాలని సూచించారు. అలవి కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమ‌ర్శించారు. ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండద‌న్నారు.

కాగా, బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలని క‌విత పిలుపునిచ్చారు.

ఉద్యమం చేసిన వాళ్లందరిపైనా ఎఫ్ఐఆర్‌లు లేవన్న ఆమె.. ఏదైనా కేసు కానీ, ఎఫ్ఐఆర్ కానీ ఉంటే అది బీఆర్ఎస్ వాళ్లపైనే ఉన్నాయ‌ని తెలిపారు. తెలంగాణ కోసం కోట్లాడింది బీఆర్ ఎస్ మాత్ర‌మేన‌ని చెప్పుకొచ్చారు.