Begin typing your search above and press return to search.

జైల్లో జపమాల కోరిన కవిత.. అనుమతిచ్చిన కోర్టు!

ఇందులో భాగంగా... తన చిన్నకుమారుడికి పరీక్షలు ఉన్నందున మద్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు.

By:  Tupaki Desk   |   2 April 2024 4:37 AM GMT
జైల్లో జపమాల కోరిన కవిత.. అనుమతిచ్చిన కోర్టు!
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తన చిన్నకుమారుడికి పరీక్షలు ఉన్నందున మద్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో మరికొన్ని కోరికలూ కోరారు కవిత! ఈ నేపథ్యంలో మద్యంతర బెయిల్ పిటిషన్ ను ఈ నెల 4కి వాయిదా వేసిన కోర్టు.. ఆమె కోరిన ఇతర కొరికలకు అనుమతి ఇచ్చారు!

అవును... తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16వ తేదీవరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత. ఈ సమయంలో కవిత పిటిషన్ ను విచారించిన కోర్టు ఈడీకి నొటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా కవిత తరుపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ.. మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా కవిత కోరిన కొన్ని కోరికలకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇందులో భాగంగా... ఇంటి భోజనంతోపాటు కవితకు 10 పుస్తకాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ధ్యానం చేసుకోవడానికి జపమాలను కూడా కోర్టు అనుమతిచ్చింది. ఇదే సమయంలో స్పోర్ట్స్ షూ కావాలని.. అది కూడా లేస్ లేని షూ కావాలని కోరగా.. అందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 4కి వాయిదాపడింది. రెగ్యులర్ బెయిల్ తో పాటు మద్యంతర బెయిల్ పిటిషన్ కూడా వేసినట్లు కవిత తరుపు న్యాయవాది నితిన్ రాణా తెలిపారు!

కాగా... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో కవితను విచారించారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ సమయంలో ఇంటి భోజనం, బుక్స్, షూ అందించాలని మరోసారి కోర్టు ఆదేశాలు జారీచేసింది.

గతంలో కూడా ఈ ఆదేశాలు జారీ చేసినా.. జైలు అధికారులు పాటించలేదని కవిత కోర్టూలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన కోర్టు.. వెంటనే సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ధాన్యం చేసుకోవడానికి జపమాల, చదువుకోవడానికి 10 పుస్తకాలను అనుమతిచ్చింది!