Begin typing your search above and press return to search.

కవిత లెటర్ వర్సెస్ ఆస్తి...ఫ్యామిలీలో పెద్ద చర్చ నిజమా ?

అటువంటి కవిత ఏకంగా తండ్రి కేసీఆర్ కే లేఖను సంధించారు. అంతే కాదు కేసీఆర్ వ్యవహార శైలినే ఎత్తి చూపించారు.

By:  Tupaki Desk   |   23 May 2025 6:00 PM IST
కవిత లెటర్ వర్సెస్ ఆస్తి...ఫ్యామిలీలో పెద్ద చర్చ నిజమా ?
X

కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ కేసీఆర్. ఆయన ముద్దుల కుమార్తె. తండ్రి పట్ల ఎంతో అభిమానం చూపించే తనయ. అటువంటి కవిత ఏకంగా తండ్రి కేసీఆర్ కే లేఖను సంధించారు. అంతే కాదు కేసీఆర్ వ్యవహార శైలినే ఎత్తి చూపించారు. నిజంగా ఇది షాకింగ్ పరిణామమే. ఎవరూ ఊహించనిదే.

కవిత ఏ రోజూ కేసీఆర్ కి ఎదురు నిలిచి లేదు. ఆ రోజు వస్తుందని ఎవరూ అనుకోని ఉండరు. కానీ అనుకోనివి జరగడమే రాజకీయమైనా జీవితమైనా అని భావించాలి. అందుకే కవిత లేఖను కూడా అలాగే చూడాలి. తండ్రి మాట జవదాటని తనయ ఎందుకిలా చేశారు. ఏమాశించి చేశారు. దాని వెనక రాజకీయ వ్యూహాలు ఉన్నాయా లేక వేరే విధమైన ఆలోచనలు ఉన్నాయా అన్నదే వేడి వేడి చర్చగా ఉంది.

ఇక ఎంత రాజకీయ కుటుంబాలు అయినా పెద్ద కుటుంబాలు అయినా గొడవలు సహజం. వాటికి ఎవరూ అతీతులు కారు. ఉదాహరణకు చూస్తే వైఎస్సార్ మరణించాక ఆయన కుటుంబంలో కూడా ఇలాంటివే జరిగాయి. జగన్ కి షర్మిలకూ మధ్య ఆస్తుల అతి పెద్ద యుద్ధమే జరగడాన్ని అంతా చూస్తూనే ఉన్నారు.

ఇదే తీరున కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల గొడవలు ఉన్నాయా అంటే అవే ఉన్నాయని పుకార్లుగా షికారు చేస్తున్న వార్తలు ఎన్నో ఉన్నాయిట. ఇక కేసీఆర్ ఆస్తుల విషయంలో తీసుకుంటే నూటికి తొంబై శాతం కేటీఆర్ కి పది శాతం మాత్రమే కవితకు పంపకాలు చేశారు అని గాసిప్స్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో కూడా ఈ గాసిప్స్ నే వైరల్ అవుతున్నాయి. ఇక కేటీఆర్ కి ఎంత వాటావో తనకూ అంతే వాటా కావాలని కవిత పట్టుబట్టిందని కూడా పుకార్లు ఉన్నాయి. అయితే కేటీఆర్ తన వారసుడు అని కేసీఆర్ తెగేసి చెప్పారని అంటున్నారు.

ఈ నేపధ్యంలోనే కవిత కేసీఆర్ కి ఎదురు నిలిచింది అని అంటున్నారు అంతే కాదు ఆమె మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుకు టచ్ లోకి వెళ్ళింది అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇక బీఆర్ఎస్ లో చూస్తే కేటీఅర్ సంతోష్ ఒకటిగా ఉన్నారని అలాగే హరీష్ రావు కవిత మరో వర్గంగా ఉన్నారని అంటున్నారు.

నిజంగా నిజమా అంటే గాసిప్స్ అలా ఉన్నాయి. రాజకీయాల్లో ఇలాంటివి అత్యంత సహజం. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ తో సమానంగా కవిత కూడా పనిచేసారు అని అంటున్న వారూ ఉన్నారు. ఆమె తండ్రికి తోడుగా నీడగా మొదటి నుంచి ఉంటూ వస్తున్నారు అని అంటున్నారు.

ఇక చెప్పాలంటే తెలంగాణా జాగృతి పేరుతో ఉద్యమ కాలంలో కవిత చేసిన కార్యక్రమాలు కూడా తెలంగాణాలో పోరాట స్పూర్తిని రగిలించాయని అంటున్నారు. ఆమె కూడా ఎక్కడా తీసిపోలేదని చెబుతారు. ఆమె తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న వాక్చాతుర్యంతో తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తారని పేరు. అలాగే పంచ్ లు వేయడంతో ప్రత్యర్థుల మీద తీవ్ర విమర్శలు చేయడంలో వెనకడుగు వేయరు.

అంతే కాదు ఆమె బీఆర్ఎస్ లో ఫైర్ బ్రాండ్ లేడీగా ఒక ఇమేజ్ సంపాదించారు. అయితే కవితలో అసంతృప్తి చాలా కాలంగా ఉంది అని అంటున్నారు. అదెలా అంటే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేటీఅర్ కి ఎలివేషన్స్ ఎక్కువ అయ్యాయి. దాంతో కవిత తగ్గిపోతూ వచ్చారు. ఇక ఆమె నిజమాబాద్ లో ఎంపీగా ఓటమి పాలు కావడం తరువాత ఎమ్మెల్సీగా నెగ్గినా మంత్రి కాలేకపోవడం ఇలా రాజకీయంగా అన్న తో పోలిస్తే వెనకబడిపోయారు అని అంటారు.

ఈ నేపధ్యంలో ఆమె లిక్కర్ స్కాం కేసులో జైలులో ఆరు నెలల పాటు ఉండడం కూడా ఆమె పొలిటికల్ కెరీర్ లో చేదు అనుభవంగానే ఉంది. అదే జైలులో కనుక వేరొకరు ఉంటే వారికి వచ్చే పొలిటికల్ ఎలివేషన్స్ వేరే విధంగా ఉండేవి. కానీ జైలు నుంచి వచ్చినా కవితకు పెద్దగా పొలిటికల్ మైలేజ్ అయితే దక్కలేదు ఇక మెల్లగా పార్టీ మీద కేటీఆర్ ముద్ర బలంగా పడుతోంది అని అంటున్నారు.

దాంతో పాటు ఆస్తుల వ్యవహారాలలో కూడా తనకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడంతోనే కవిత ఇలా లేఖ రూపంలో బయటపడ్డారు అని అంటున్నారు. ఇక కవిత ఇంతటితో ఊరుకుంటారా లేక మరో అడుగు ముందుకు వేస్తారా అంటే ఆమె కూడా కేసీఆర్ రక్తమే. ఆయనలోని పట్టుదల ఆమెకూ ఉన్నాయి కాబట్టి ఆమె రానున్న రోజులలో దూకుడుగానే రాజకీయంగా ముందుకు వెళ్తారు అని అంటున్నారు. మరి ఆమె తీసుకునే నిర్ణయాలు వేసే అడుగులు ఏ రూపంలో ఉంటాయన్నదే చూడాల్సి ఉందని అంటున్నారు.