Begin typing your search above and press return to search.

తిరుమల మొక్కు తరువాత కవిత రాజకీయ లెక్క

ఇక నిన్నటిదాకా ఒక ఎత్తు ఈ రోజు నుంచి మరో ఎత్తు అన్నది కవిత ఆలోచనగా ఉంది అని అంటున్నారు. బీఆర్ఎస్ లో ఉన్న వారిలో అసంతృప్తిపరులను ఆమె ఆకర్షించేందుకు చూస్తున్నారు అని అంటున్నారు.

By:  Satya P   |   4 March 2026 9:30 AM IST
తిరుమల మొక్కు తరువాత  కవిత  రాజకీయ లెక్క
X

తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. లిక్కర్ స్కాం కేసులో తాజాగా కోర్టు తీర్పు ఆమెకు ఊరటను ఇచ్చేలా వచ్చింది. దాంతో తిరుమల శ్రీవారి మొక్కుని తీర్చుకునేందుకు కవిత వస్తున్నారు. ఆమె ఈ నెల 5న తిరుపతి చేరుకుని అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. 6న తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకుంటారని చెబుతున్నారు.

రెండు నెలలలో పార్టీ :

ఇదిలా ఉంటే కవిత తన తిరుమల పర్యటన పూర్తి చేసుకుని మొక్కులు చెల్లించిన అనంతరం హైదరాబాద్ చేరుకున్న తరువాత కొత్త పార్టీ విషయంలో సంచలన ప్రకటన చేస్తారు అని అంటునారు. రెండు నెలలలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తాను అని కవిత చెప్పారు. ఇపుడు ఆ విషయం మీద ఆమె ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే ఆమె తెలంగాణా జాగృతి ద్వారా జనంలోకి వెళ్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే తిరుమల పర్యటన తరువాత ఆమె తన కార్యక్రమాలను మరింత పెంచుతారు అని అంటున్నారు.

బీఆర్ఎస్ మీదనే :

ఇక నిన్నటిదాకా ఒక ఎత్తు ఈ రోజు నుంచి మరో ఎత్తు అన్నది కవిత ఆలోచనగా ఉంది అని అంటున్నారు. బీఆర్ఎస్ లో ఉన్న వారిలో అసంతృప్తిపరులను ఆమె ఆకర్షించేందుకు చూస్తున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం మీద విసిగిన వారు కేసీఆర్ కుమార్తె అయిన కవిత వైపు చేరుతారు అని అంటున్నారు. ఆమె మీద లిక్కర్ స్కాం మచ్చ ఉందని ఆలోచించిన వారు సైతం ఇపుడు ఆమెకు కోర్టు ద్వారా క్లీన్ చిట్ లభించడంతో ఏ విధమైన ఫికర్ లేకుండా వచ్చి చేరుతారు అని అంటున్నారు. కేసీఆర్ చరిష్మా వారసత్వం విషయంలో కవిత కూడా పోరాడుతున్నారు కాబట్టి ఆమె వైపు ఉండడంలో తప్పు లేదని అంటున్న వారూ ఉన్నారని చెబుతున్నారు.

ఎన్నికల వేళకు వ్యూహం :

ఇక కొత్త పార్టీ పెడితే వీలైనంత వరకూ గులాబీ పార్టీ నుంచి చేరికలు ఉంటాయని కవిత అంచనా వేస్తున్నారు అని అంటున్నారు. అలాగే బీజేపీ సహా ఇతర పార్టీల నుంచి కూడా వచ్చే వారిని ఆకర్షించాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఎన్నికల వేళకు రాజకీయంగా ఏమి చేయాలన్నది కూడా వ్యూహాలు ఉన్నాయని చెబుతున్నారు. పొత్తుల విషయంలో కూడా ఏమైనా ఆలోచనలు చేయవచ్చు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. మొత్తానికి చూస్తే కవిత పార్టీని పెట్టి రానున్న కాలమంతా జనంలో ఉండాలని చూస్తున్నారు. అలాగే పాదయాత్రను కూడా వీలు చూసి సిద్ధపడతారు అని అంటున్నారు. మొత్తం మీద కవిత తిరుమల శ్రీవారి ఆశీస్సుల తరువాత సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.