కేసీఆర్ విత్ తెలంగాణా ట్యాగ్ తోనే కవిత !
ఇక తండ్రి చాటు బిడ్డగా ఉంటూ ఒకసారి ఎంపీ ఒక సారి ఎమ్మెల్సీగా అధికార పదవులు చేపట్టిన కవితకు ఇపుడు రాజకీయంగా తాను ఏంటో పక్కాగా రుజువు చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 4 Sept 2025 5:00 AM ISTబీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత తన రాజకీయ ఐడెంటిటీ నిరూపించుకునే ప్రయత్నంతో ఉన్నారు. అయితే ఆమె తాజా ప్రెస్ మీట్ లో చెప్పినట్లుగా కేరాఫ్ కేసీఆర్ గానే జన పరిచితం. ఆమెకు మీడియా ఇంపార్టెన్స్ ఇచ్చినా లేక అదే విధంగా ఆమె ప్రముఖంగా కనిపించినా అంతా వెనక ఉన్న దిగ్గజ నాయకుడు కేసీఆర్ అని తెలుసు. అందుకే కేసీఆర్ కి ఎదుకు వెళ్ళి కవిత సాధించేది ఏదీ లేకపోగా ఉనికే ప్రశ్నార్ధం అవుతుంది. అందుకే ఆమె తన తండ్రి కేసీఆర్ నామ స్మరణతోనే ఎక్కడికి అయినా వెళ్ళాల్సి ఉంటుంది అన్నది నిజం.
కేసీఆర్ దేవుడు అంటూ :
కేసీఆర్ కి తెలంగాణాను సాధించిన నేతగా ఈ రోజుకీ గుర్తింపు ఉంది. ఆయన రెండు టెర్ములు సీఎం గా పనిచేశారు. ఇక ఆయన రాజకీయ వారసుడు ఎవరో కూడా డిక్లేర్ అయిపోయింది. కేటీఆర్ ఆ స్థానంలో ఉన్నారు. మరో వైపు హరీష్ రావు కూడా ఉన్నారు. అయితే కవితకు ఈ ఇద్దరితో పోలిస్తే జనంలో ఉండే క్రేజ్ తక్కువ. అందుకే ఆమె కేసీఆర్ పేరుతోనే జనంలోకి రానున్న రోజులలో వస్తారు అన్నది తెలుస్తోంది. కేసీఅర్ పేరు చెబుతూనే ఆమె తెలంగాణాను కూడా ఒక నినాదంగా మార్చుకుంటూ ముందుకు సాగుతారు అని అంటున్నారు.
రుజువు చేసుకుంటేనే :
ఇక తండ్రి చాటు బిడ్డగా ఉంటూ ఒకసారి ఎంపీ ఒక సారి ఎమ్మెల్సీగా అధికార పదవులు చేపట్టిన కవితకు ఇపుడు రాజకీయంగా తాను ఏంటో పక్కాగా రుజువు చేసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడింది అని అంటున్నారు. ఆమె రాజకీయంగా తనలోని నాయకత్వ పటిమను రుజువు చేసుకోవాల్సిన తరుణం ఇదే అంటున్నారు. ఆమె కనుక ఆ విధంగా జనంలో ఎంతో కొంత పాపులారిటీని సంపదిస్తేనే తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళినా గౌరవం ఉంటుంది లేక ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా మర్యాద ఉంటుంది అని అంటున్నారు.
టఫ్ టాస్క్ ని ఎంచుకుంటే :
ఇక కవిత పార్టీ పెడతారు అని అంటున్నారు. కానీ ఆమె పార్టీ పెట్టినా ఇపుడు ఉన్న రాజకీయాల నేపథ్యంలో తెలంగాణాలోని రాజకీయ వాతావరణంలో అది నిలదొక్కుకోవడం కష్టం అని అంటున్నారు. బలమైన పార్టీలుగా మూడు ఉన్నాయి. జనాల ఫోకస్ కూడా వాటి మీదనే ఉంటుంది. అందువల్ల కవైత పార్టీ అన్నది ఖర్చుతో కాలం ఖర్చుతో శ్రమతో కూడుకున్నదే అవుతుంది తప్ప ఫలితాలు అయితే ఇవ్వదు, ఇక పార్టీ పెడితే పోటీ చేయాల్సి ఉంటుంది. పోటీ చేస్తే సత్తా తేలిపోతుంది. దాంతో రాజకీయం కూడా క్లోజ్ అవుతుంది. అందువల్ల పార్టీ పెట్టడం అన్నది టఫ్ టాస్క్ గానే చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు
జాగృతి తోనే ముందుకు :
అదే సమయంలో జనంలో నాలుగు రోజుల పాటు నానిన తరువాత ఆమెకి ఇపుడు ఉన్న క్రేజ్ కూడా ఉండదని అంటున్నారు. ఆమె విషయం కూడా పాతబడిపోతుంది. దాంతో మీడియా ఫోకస్ కూడా ఉండదు. అదే సమయంలో ఆమె చెప్పినట్లుగా జనంలోకి వెళ్ళి వారి సమస్యల మీద పోరాటం చేస్తే కనుక ఎంతో కొంత రాజకీయంగా ఉనికి కాపాడుకోవడం జరుగుతుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కవిత తన కొత్త రాజకీయం ఏ విధంగా వెతుక్కుంటారు అన్నది చూడాల్సి ఉంది. రాజకీయాల్లో హత్యలు ఉండవని అంటారు. ఆత్మ హత్యలే ఎక్కువగా వినిపిస్తాయి. కవీత తన దారిలో ఎలా ముందుకు సాగుతారు అన్నదే ఆసక్తికరం అని అంటున్నారు.
