Begin typing your search above and press return to search.

మై డియర్ డాడి అంటూ కవిత సంధించిన బ్రహ్మాస్త్రం

తెలంగాణాను సాధించిన ఉద్యమ నాయకుడు రెండు సార్లు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత సాధించిన వారు కె చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఅర్.

By:  Tupaki Desk   |   22 May 2025 8:46 PM IST
మై డియర్ డాడి అంటూ కవిత సంధించిన బ్రహ్మాస్త్రం
X

తెలంగాణాను సాధించిన ఉద్యమ నాయకుడు రెండు సార్లు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత సాధించిన వారు కె చంద్రశేఖరరావు ఉరఫ్ కేసీఅర్. ఆయన మాటకు పార్టీలో ఎదురు లేదు, ఆయన కత్తికి పదును ఎప్పుడూ తగ్గలేదు. ఆయన దూకుడుకు ఎపుడూ బ్రేక్ లేదు. అలాంటి కేసీఅర్ ని డియర్ డాడీ అనొ సంభోసితూనే బీఅర్ఎస్ పార్టీలో చోటు చేసుకున్న అనేక అంశాలను అందులో ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయన ముద్దుల తనయ కల్వకుంట్ల కవిత సంధించిన లేఖాస్త్రం ఇపుడు బ్రహ్మాస్త్రంగా మారి తెగ వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ లేఖలో కవిత ఏ విషయాలు ప్రస్తావించారు అనే దాని కన్నా ముందు బీఆర్ఎస్ లో అలాంటి సంప్రదాయం ఉందా అన్న చర్చ సాగుతోంది. అధినేతనే సూటిగా ప్రశ్నించే సాహసం ఎవరైనా చేశారా అంటే లేదు అనే వస్తుంది. పార్టీని ధిక్కరిస్తే వారు బయటకే అన్నది కూడా ఉంది. కానీ కేసీఆర్ కుమార్తె కాబట్టి చొరవ తీసుకుని తన తండ్రికి అధినేతకూ కూడా లేఖ ద్వారా చాలా విషయాలు చెప్పారని అంటున్నారు.

ఒక విధంగా ఆమె సంధించిన ఈ లేఖాస్త్రం ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రంగా మారుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇక ఈ ఆరు పేజీల లేఖలో అంశాల విషయానికి వస్తే ఇటీవల జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం మీదనే కవిత అనేక సందేహాలను కీలక విషయాలను ప్రస్తావిస్తూ రాశారు.

నిజానికి చూస్తే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. దాదాపుగా నెల రోజులు కావస్తున్న వేళ ఇపుడు ఈ సమయంలో కవిత లేఖ రాయడం అంటే ఆ టైం టైమింగ్ వెనకాల వ్యూహం ఆమెకే తెలియాలి అని అంటున్నారు. అయితే కేసీఆర్ రజతోత్సవ సభలో ఇచ్చిన స్పీచ్ పట్ల మాత్రం కవిత అసంతృప్తినే ఆ లేఖ ద్వారా వ్యక్తం చేశారు అని అంటున్నారు.

ముఖ్యంగా బీజేపీతో పొత్తు మీద కేసీఆర్ సభలో సరైన క్లారిటీ ఇవ్వలేదని ఆమె పాయింట్ అవుట్ చేశారు. బీజేపీ మీద కేవలం రెండు నిముషాలే కేసీఆర్ మాట్లాడారు అని ఆమె ఎత్తి చూపారు. ఇక బీజేపీ వల్లనే తాను చాలా బాధ పడ్డాను అని ఆమె ఆరు నెలల తన జైలు జీవితాన్ని తలచుకున్నారు.

అలాంటి సందర్భంలో కేసీఆర్ బీజేపీని గట్టిగా టార్గెట్ చేసి ఉంటే బాగుండేది అన్నది ఆమె భావనగా లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ మధ్య తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చారన్న భావన జనలోకి వెళ్ళిందని ఆమె పార్టీలోని మరో లోపాన్ని ఎత్తు చూపారు. ఈ మేసెజ్ ని కాంగ్రెస్ జనాల్లోకి బలంగా తీసుకుని వెళ్ళింది అని కూడా గుర్తు చేశారు.

అందువల్ల ఈ గందరగోళానికి ఈ తరహా అనుమానాలు నివృత్తి చేయడానికి కేసీఅర్ తన స్పీచ్ లో బీజేపీ మీద బీఆర్ఎస్ వైఖరి మీద ఒక క్లారిటీ ఇస్తారని అంతా భావించారు అని ఆమె అన్నారు. కచ్చితమైన ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ఇస్తారని అంతా ఆశించారని కూడా కవిత అన్నారు.

అంతే కాదు ఎస్సీ వర్గీకరణ మీద కేసీఆర్ నోరు విప్పలేదని కూడా ఆమె మరో ఆరోపణ లాంటిది చేశారు. తెలంగాణా తల్లి విగ్రహం మార్పు, తెలంగాణా గీతం వంటి వాటి మీద మోటివేట్ చేస్తారని అంతా భావించారని కానీ అలా జరగలేదని ఆమె అన్నారు. వక్ఫ్ బిల్లు మీద బీసీలకు 42 శాతం రిజరేషన్ల మీద కూడా కేసీఆర్ మాట్లాడి ఉండాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ అంటే పంచులకు మారు పేరు అని ఆయన నుంచి చాలా ఎక్కువగా పంచ్ మార్కులను స్పీచ్ లో జనాలు ఎదురుచూశారని కవిత అన్నారు. ఇక వేదిక మీద పార్టీ లీడర్లకు పెద్దగా చాన్స్ దక్కలేదని అలాగే పాత నాయకులకే ఇంచార్జిలకే లోక్ బాడీ బీ ఫారాలు ఇస్తారా అని ప్రశ్నించారు. 2001 నుంచి పార్టీలో ఉన్న వారిని వేదిక పైన పిలిచి మాట్లాడనీయకపోవడమేంటని కూడా ఆమె ప్రశ్నించారు.

మొత్తానికి చూస్తే కవిత తన తండ్రి మీద బాణాలనే వేశారు. అయితే అవి సుతి మెత్తగానే తాకేలా జాగ్రత్త పడ్డారు. ఏతా వాతా ఆమె చెప్పేది ఏంటి అంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభలలో కేసీఆర్ స్పీచ్ కిక్ ఇవ్వలేదనే అని అంటున్నారు. అంతే కాదు బీజేపీ మీద గట్టిగా విమర్శలు చేయలేదని కూడా అన్నారు. అందుకే ఈ లోపాలను సరిదిద్దేందుకు మరో ప్లీనరీని ఆమె నిర్వహినమని కోరుతున్నారు. మరి కవిత రాసిన ఈ లేఖ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఎలా కదిలిస్తుందో ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.