డాడీ డాటర్ మధ్యలో సంతోష్...ఇదీ కేసీఆర్ పరిస్థితి !
బీఆర్ఎస్ లో కోవర్టులు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయా కేసీఆర్ దేవుడు అయితే ఆయన చుట్టూ కూడా మంచి వారే ఉండాలి కదా.
By: Tupaki Desk | 25 May 2025 9:00 AM ISTబీఆర్ఎస్ లో కోవర్టులు ఉన్నారా దెయ్యాలు ఉన్నాయా కేసీఆర్ దేవుడు అయితే ఆయన చుట్టూ కూడా మంచి వారే ఉండాలి కదా. మరి దెయ్యాలు ఎక్కడ నుంచి వచ్చాయి. కోవర్టులు ఏమిటి. ఇలాంటి ప్రశ్నలు తెలుగు నాట వినిపిస్తున్నాయి. రాజకీయాల మీద ఆసక్తి కలిగిన ప్రతీ వారూ వీటి మీదనే చర్చిస్తున్నారు. నిజంగా కేసీఆర్ కోటరీ చేతిలో ఉన్నారా. ఆయన చుట్టూ దెయ్యాలు తప్ప మంచి సలహాలు ఇచ్చేవారు లేరా అన్నది కూడా ఆలోచిస్తున్నారు.
నిజానికి ఈ తరహా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ కలగడానికి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత సంధించిన లేఖాస్త్రం. ఆమె లేఖ ఇపుడు బహిర్గతం అయింది. దాంతోనే ఈ చర్చలు సందేహాలు ఇలా ఎన్నో వస్తున్నాయి.
ఇదిలా ఉంటే కవితకు కేసీఆర్ కీ మధ్య అంతరం ఉందా. ఆమె తన డాడీని సులువుగా కలవలేకపోతున్నారా అన్నది మరో చర్చగా ఉంది. అంతే కాదు డాటర్ కి డాడీకి మధ్యన ఉన్న శక్తులు ఏవీ అన్నది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి.
ఇలా కవిత రాసిన లేఖ దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక ఈ లేఖ రాయడం ద్వారా సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడానికా అక్కడ స్పేస్ తీసుకోవడానికా అన్న చర్చ కూడా వస్తోంది. కవిత రాసిన లేఖ వెనక ఏముంది అన్నది కూడా చర్చిస్తున్నారు. ఆమె ఉద్దేశ్యాలు ఏమై ఉంటాయన్నది కూడా ఆలోచిస్తున్నారు.
ఆస్తి కోసమా అని కూడా లేక రాజకీయ వాటా కోసమా అని కూడా చర్చిస్తున్నారు. ఇక డాడీకి డాటర్ కి మధ్యలో ఎవరు ఉన్నారు. ఈ ఇద్దరినీ కలవనీయకుండా చేస్తున్న శక్తులు ఎవరు అన్నది కూడా చర్చగా ఉంది. ఇక చూస్తే సంతోష్ అనే కీలక నేత కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు అయిన వారే డాడీ డాటర్ కి మధ్యలో ఉన్నారు అని కూడా అనుకుంటున్నారుట.
ఇక సంతోష్ ట్రాప్ లో కేసీఆర్ ఉన్నారని కవిత భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆమె కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు చేరాయని ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడుతూ అన్నారని అంటున్నారు. అలా చూస్తే కనుక కేసీఅర్ వద్ద సంతోష్ పలుకుబడి పెరిగిపోతోందా అన్న చర్చ కూడా సాగుతోంది.
ఇదిలా ఉంటే కవిత రాసిన లేఖ లీక్ కావడంతో ఏమి జరుగుతుంది అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఇంత యాగీ జరిగాక ఆమె పార్టీలో ఉండడం జరిగేది కాదు అని అంటున్నారు. ఇక ఆమె వయసు కూడా చిన్నది కాబట్టి రాజకీయంగా రాణించే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఆమె ఏ రకమైన చాయిస్ ని ఎంచుకుంటారు అన్నదే చర్చగా ఉంది. ఆమె కొత్త పార్టీ పెడతారా లేక రాజకీయగా పలుకుబడి పెంచుకుని వేరే పార్టీలో చేరుతారా లేక రాజకీయాలే వద్దు అని దండం పెడతారా అని వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే కవితలో ఉత్సాహం చూసినా ఆమెకు ఉన్న రాజకీయ అవగాహన చూసినా ఆమెకు ఉన్న రాజకీయ ప్రతిభ చూసినా ఆమె కచ్చితంగా రాజకీయాల్లోనే కొనసాగుతారని అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ లో మాత్రం కవిత ఇష్యూ రగులుతూనే ఉంది అని అంటున్నారు. ఆమె మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు ఆమె మీద యాక్షన్ తీసుకుంటే ఒక బెడద తీసుకోకపోతే మరో బెడద అని అంటున్నారు. ఎందుకు అంటే ఆమెని లైట్ తీసుకుని వదిలేస్తే అది పార్టీలో క్రమశిక్షణనే ప్రశ్నించినట్లుగా అవుతుంది. అలాగని ఆమె మీద యాక్షన్ తీసుకుంటే అది వేరేగా మారి ఆమె దూకుడు చేస్తే అపుడు పరిస్థితి ఏంటి అన్నది కూడా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా డాడీ డాటర్ మధ్యలో కోవర్టులు అన్న ఇష్యూ అయితే ఇపుడు బీఆర్ఎస్ లో రగులుతున్న హాట్ టాపిక్ గానే ఉంది.
