ఎక్కడ విన్నా ఇదే: కవితను సస్పెండ్ చేస్తారా?
ఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెం డ్ చేస్తారా? ఆమె పార్టీ నుంచి బయటకు వస్తారా? అనే చర్చే కనిపిస్తోంది.
By: Tupaki Desk | 24 May 2025 2:42 PM ISTఎక్కడ విన్నా ఇదే మాట వినిపిస్తోంది. బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెం డ్ చేస్తారా? ఆమె పార్టీ నుంచి బయటకు వస్తారా? అనే చర్చే కనిపిస్తోంది. ఏ ఇద్దరుకలుసుకున్నా.. ఈ చర్చ మరింత ఎక్కువగా వినిపిస్తుండడం గమనార్హం. పార్టీ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ.. ఆమె లేఖ రాయడం వరకు బాగానేఉంది. అయితే.. దీనిని పార్టీలైన్‌కు విరుద్ధమంటూ.. కేటీఆర్ వ్యాఖ్యానించారు.
పార్టీ లైన్‌కు విరుద్ధంగా అంతర్గత విషయాలను రోడ్డున పడేయడం ఏంటని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలు.. పార్టీకి రుచించబోవన్నట్టుగా కూడా కేటీఆర్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో కవిత రాసిన లేఖ పార్టీలైన్‌కు విరుద్ధంగానే ఉందన్న చర్చసాగుతోంది. కాబట్టి.. ఆమెపై వేటు వేస్తారా? సస్పెం డ్ చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ వేటు వేస్తే.. కన్న కుమార్తె అయినా.. పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తే.. చర్యలు తీసుకున్నారన్న పేరు కేసీఆర్‌కు వస్తుంది.
అదేసమయంలో తాను పార్టీ మంచి కోరి చెబితే.. తనను సస్పెండ్ చేశారన్న కవిత రాజకీయ విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే.. అటు సస్పండ్ చేస్తే.. ఈ విషయాన్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. పోనీ.. సస్పెండ్ చేయకుండా వదిలేస్తే.. ఈ రోజు కవిత అన్నట్టుగా.. రేపు మరికొందరు నాయ కులు కూడా లేఖల రూపంలో పార్టీపై విమర్శలు చేసినా.. అధినేతను తప్పుబట్టినా.. వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండక పోవచ్చు.
ఎందుకంటే.. కవితే విమర్శించిన తర్వాత.. ఇతర నాయకులు కూడా అదే బాట పడితే.. కేసీఆర్ తప్పుబట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో అటు కవిత వ్యవహారంపై కేసీఆర్ అంతర్గతంగా మధన పడుతున్నారని.. ప్రాధమికంగా అయినా.. ఆమెపై చర్యలు తీసుకోకపోతే.. పార్టీకి సరైన సంకేతాలు ఇచ్చినట్టు ఉండబోదని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకే కవితపై ప్రాధమికంగా అయినా సస్పెన్షన్ కొరడా విధించే అవకాశం ఉంటుందని చర్చ సాగుతోంది.
