Begin typing your search above and press return to search.

క‌విత 'బాయిబాట‌'.. `సింగ‌రేణి`పై ప‌ట్టు బిగింపు

తెలంగాణ ర‌క్ష‌ణ సేన(టీఆర్ ఎస్‌) అధ్య‌క్షురాలు.. క‌విత కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. బాయిబాట పేరుతో సింగ‌రేణి బొగ్గుగ‌ని కార్మికులను ఆమె ప‌ల‌క‌రించ‌నున్నారు.

By:  Garuda Media   |   15 Jun 2026 9:00 PM IST
క‌విత బాయిబాట‌.. `సింగ‌రేణి`పై ప‌ట్టు బిగింపు
X

తెలంగాణ ర‌క్ష‌ణ సేన(టీఆర్ ఎస్‌) అధ్య‌క్షురాలు.. క‌విత కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. బాయిబాట పేరుతో సింగ‌రేణి బొగ్గుగ‌ని కార్మికులను ఆమె ప‌ల‌క‌రించ‌నున్నారు. అయితే.. ఇది కేవ‌లం ప‌రామ‌ర్శ యా త్ర మాత్ర‌మే కాదు.. పొలిటిక‌ల్ యాత్ర‌గా కూడా మారుతుంది. సింగ‌రేణి ప‌రిధిలోని 5 అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల్లో క‌విత పాదయాత్ర‌గా ముందుకు సాగ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా సింగ‌రేణి కార్మికుల‌తో ఆమె మ‌మ‌కం కానున్నారు.

ఎక్క‌డెక్క‌డ ..

బాయి బాట కార్య‌క్ర‌మాన్ని రెండు ద‌శ‌లుగా చేప‌ట్ట‌నున్నారు. తొలి ద‌శ సోమ‌వారం నుంచి 20వ తేదీ వ‌రకు జ‌రుగుతుంది. రోజుకొక నియోజ‌క‌వ‌ర్గంలో క‌విత పాద‌యాత్ర‌గా వెళ్లి కార్మికుల‌ను క‌లుసుకుంటారు. చెన్నూ రు, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వివిధ అండర్ గ్రౌండ్, ఓపెన్ కాస్ట్ గనుల వద్ద కార్మికులతో సమావేశాలు నిర్వ‌హిస్తారు. త‌ద్వారా కార్మికుల‌ను త‌న వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తారు.

ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వానికి కూడా క‌విత కొన్ని సూచ‌న‌ల‌తోపాటు డిమాండ్లు కూడా చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్షాకాలం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో బావుల్లో కార్మికుల ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది. అదేస‌మ‌యంలో బకాయి పడిన రూ.50,000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయను న్నారు. సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ వద్ద కార్మికులతో సమావేశం నిర్వ‌హించి.. వారి త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌నున్నారు.

బీఆర్ ఎస్ హ‌యాంలో..

బీఆర్ ఎస్ హ‌యాంలో క‌విత‌.. సింగ‌రేణి కార్మిక సంఘాలకు స‌ల‌హాదారుగా.. ముఖ్య నాయ‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు. గౌరవ అధ్య‌క్షురాలిగా కూడా ప‌నిచేశారు. ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో సింగ‌రేణి ప‌రిధిలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను బీఆర్ ఎస్‌కు అనుకూలంగా మార్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్పుడు ఆమె.. అదే కార్మికుల‌ను తన టీఆర్ ఎస్‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇది స‌క్సెస్ అయితే.. ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌విత అనుకూల ఓటు బ్యాంకు పెరిగే అవ‌కాశం ఉంటుందని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.