Begin typing your search above and press return to search.

పహల్గాం దాడి... ట్రావెల్ బుక్కింగ్స్ ఏ స్థాయిలో క్యాన్సిల్ అంటే..?

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 April 2025 5:00 AM IST
పహల్గాం దాడి... ట్రావెల్  బుక్కింగ్స్ ఏ స్థాయిలో క్యాన్సిల్  అంటే..?
X

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా టూరిజం ఎంతో అభివృద్ధి చెందుతూ, స్థానికులకు అద్భుతమైన ఆదాయాన్ని అందిస్తూ, జమ్మూకశ్మీర్ జీడీపీలో కీలక భూమిక పోషిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో తాజా ఉగ్రదాడి ఒక్కసారిగా లెక్కలు మార్చేసింది.

అవును... కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఆ ప్రాంత టూరిజం ఆదాయంపైనా, స్థానికుల ఉపాధి అవకాశాలపైనా భారీ దెబ్బే కొట్టింది. ఈ సమయంలో వచ్చే నెలలో లోయను సందర్శించాలని ప్లాన్ చేసుకున్న అనేక మంది పర్యాటకులు తమ షెడ్యూల్ ను రద్దు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న పర్యాటకులు భద్రతా సమస్యల కారణంగా సుమారు 90 శాతం బుకింగ్ లు రద్దు చేసుకున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. ఇది జమ్మూకశ్మీర్ టూరిజంపై ఏ స్థాయిలో దెబ్బ తగిలిందో చెప్పకనే చెబుతుందని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ఇప్పటికే హోటల్ బుక్కింగ్స్ ను రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.

వాస్తవానికి ఉగ్రవాద దాడి అనంతరం జమ్మూకశ్మీర్ లో భద్రతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఇది పర్యాటకంతో పాటు స్థానిక వ్యాపారాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ టూర్ ఆపరేటర్స్.. బుధవారం మధ్యాహ్నం వరకూ జమ్మూకాశ్మీర్ కు షెడ్యూల్ చేసిన ట్రిప్ లలో 35% బుకింగ్ లు రద్దు చేయబడినట్లు తెలిపింది.