Begin typing your search above and press return to search.

వీడియో.. ఉగ్రదాడి వేళ భారత్ లో పాక్ అధికారుల సెలబ్రేషన్స్!

తాజాగా న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ తీసుకువెళ్తు కనిపించాడు. ఈ సమయంలో అతనితో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది.

By:  Tupaki Desk   |   24 April 2025 1:29 PM IST
వీడియో.. ఉగ్రదాడి వేళ  భారత్  లో పాక్  అధికారుల సెలబ్రేషన్స్!
X

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు భయానక వాతావారణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై భీకర దాడి చేశారు.. ఎకే 47 తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 ప్రాణాలు తీశారు. ఈ దాడిని భారత్ సహా ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ సమయంలో పాక్ హైకమిషన్ ఆఫీసుకు సంబంధించిన ఓ విషయం తెరపైకి వచ్చింది!

అవును... ఓ పక్క ఉగ్రవాదుల దాడిలో 26 మంది మరణించి యావత్ భారత్ కన్నీటితో మునిగిపోయిన పరిస్థితి. కశ్మీర్ లో ప్రజానికం, పర్యాటకులు బిక్కుబిక్కుమంటున్న స్థితి! మరోపక్క పాక్ పై ప్రతీకార చర్య తీసుకోవాలనే చర్చలు! ఈ నేపథ్యంలో భారత్ లోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ తీసుకుని వెళ్తూ కనిపించారు.

తాజాగా న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేక్ తీసుకువెళ్తు కనిపించాడు. ఈ సమయంలో అతనితో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది. అయితే... అప్పటికే అందిన ఆదేశాల మేరకో ఏమో కానీ.. అతను ఏమీ మాట్లాడలేదు. మీడియాతో మాట్లాడటానికి అతడు నిరాకరించాడు.

అనంతరం దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో భారతీయ సమాజంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా... భారత్ లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తోన్న ఆ దేశ సైనిక అధికారులు, సిబ్బందిని అవాంఛిత వ్యక్తులుగా ప్రకటిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీరు దేశం విడిచి వెళ్లేందుకు వారం గడువు విధించింది. ఆ ప్రకటన అనంతరం హైకమిషన్ కార్యాలయానికి కేక్ వెళ్లడం గమనార్హం!