Begin typing your search above and press return to search.

వైట్ హౌస్ లోపల ఇలా ఉంటుంది... హోమ్ టూర్ వీడియో వైరల్!

అగ్రరాజ్యం, ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   1 May 2025 8:00 PM IST
వైట్ హౌస్ లోపల ఇలా ఉంటుంది... హోమ్ టూర్ వీడియో వైరల్!
X

అగ్రరాజ్యం, ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ వైట్ హౌస్ ను ఇప్పటివరకూ బయట నుంచే చూశారు తప్ప.. లోపల ఎలా ఉంటుందనేదానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ఇప్పటివరకూ బయటకు రాలేదు. అయితే.. వైట్ హౌస్ టూర్ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును... అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోపల ఎలా ఉంటుందనే విషయం బయట ప్రపంచానికి తెలియని సంగతి తెలిసిందే. లోపల ప్రెస్ రూమ్ మినహా మిగిలిన గదులు ఎలా ఉంటాయి మొదలైన విషయాలు ఎవరికీ తెలియదు. అయితే.. ప్రెసిడెంట్ ట్రంప్ అసిస్టెంట్, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ తాజాగా వైట్ హౌస్ హోమ్ టూర్ వీడియోను రూపొందించారు.

ఈ వీడియోలో... ప్రెస్ సెక్రటరీగా తన బాధ్యతల గురించి వివరించారు కరోలినా. ఇందులో భాగంగా... అధ్యక్షుడి సందేశం, అభిప్రాయం, అజెండాలను, అతని భావాలని ప్రెస్ ద్వారా అమెరికా ప్రజలకు తెలియజేయడమే తన పని అని అన్నారు. తాను మీడియా ముందుకు వచ్చే ముందు.. అధ్యక్షుడితో చర్చించిన అనంతరం ప్రార్థన చేసుకుని పోడియం వద్దకు వస్తానని తెలిపారు.

ఈ సమయంలో కరోలినా లీవిట్ తన కమ్యునికేషన్ టీం ని పరిచయం చేసింది. అనంతరం తన రూమ్ ను చూపిస్తూ.. అందులో తనకు నచ్చిన కొన్ని ఫోటోలను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని వివరించింది. అనంతరం వీడియోను ముగిస్తూ కరోలినా లీవిట్... వైట్ హౌస్ అధ్యక్షుడి కోసం లేదా ఇక్కడ పనిచేసే వ్యక్తుల కోసం కాదు.. ఇది అమెరికన్ ప్రజల కోసం అని ముగించారు.

దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సందర్భంగా కరోలినాకు అభినందనలు తెలియజేస్తూ, ఆశీర్వాదాలు ఇస్తూ స్పందిస్తున్నారు నెటిజన్లు!