Begin typing your search above and press return to search.

కర్ణాటకలో హిజాబ్ పై రచ్చ కంటిన్యూ.. హోం మంత్రి కీలక వ్యాఖ్యలు

కొన్ని వివాదాల జోలికే వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఫుల్ క్లారిటీతో వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు

By:  Tupaki Desk   |   25 Dec 2023 9:58 AM GMT
కర్ణాటకలో హిజాబ్ పై రచ్చ కంటిన్యూ.. హోం మంత్రి కీలక వ్యాఖ్యలు
X

కొన్ని వివాదాల జోలికే వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఫుల్ క్లారిటీతో వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మాత్రం అందుకు భిన్నంగా అటుఇటు కాని రీతిలో మారింది. ఆ రాష్ట్రంలో కొంతకాలంగా హిజాబ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సున్నిత అంశాలపై స్పందించాల్సి వచ్చినప్పుడు అన్ని చూసుకొని మాట్లాడితే సరిపోతుంది. మొన్నటికి మొన్న కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ.. హిజాబ్ మీద నిషేధాన్ని ఇంతవరకు ఎత్తేయలేదని.. త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

బహిరంగ సభలో సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేస్తూ.. హిజాబ్ అంశంపై చాలా లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హిజాబ్ బ్యాన్ పై తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదంటూ సీఎం చెప్పిన మాటనే రిపీట్ చేయటం కనిపిస్తుంది. ఇంతకూ ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాటనే హోం మంత్రి కూడా ఎందుకు చెప్పినట్లు? దానికి కారణం ఏమిటి? అన్నది చూస్తే.. ఈ ఇష్యూలోకి ఎంటరైంది బీజేపీ.

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదమే లేదని.. అలాంటప్పుడు దాన్ని ఎలా ఎత్తేస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని కొన్నిచోట్ల మాత్రమే డ్రెస్ కోడ్ కు సంబంధించిన అంశాలు ఉన్నాయని.. మిగిలిన చోట్ల అంతా మామూలుగానే ఉందని మాజీ సీఎం బొమ్మై వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత.. ఆ విషయం మీద స్పందించే వేళలో.. మాజీ సీఎం బొమ్మై చెప్పిన మాటల్లో ఉన్న లోపాన్ని ఎత్తి చూపాలంటే.. అదేదో చెప్పేస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా.. హిజాబ్ మీద లేని బ్యాన్ ను ఉన్నట్లుగా చెప్పటంలో అర్ఱథం లేదంటున్నారు.

ఇదిలా ఉంటే హిజాబ్ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ సైతం రియాక్టు కావటం గమనార్హం. తాము అధికారంలోకి రాగానే.. హిజాబ్ మీద ఉన్న బ్యాన్ ఎత్తేస్తామని కాంగ్రెస్ చెప్పిందని కానీ అలాంటిదేమీ చేయలేదంటూ తప్పు పట్టారు. ఇలా.. హిజాబ్ మీద కాంగ్రెస్ నేతలు చెప్పిన మాటలకు.. చేస్తున్న దానికి సంబంధం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి అంశాల్ని అట్టే ముదరకుండా ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉందన్న మాట పలువురి నోటి నుంచి వస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.