ముక్క ఊడేలా భార్య ముక్కు కొరికేశాడు... అసలేం జరిగింది?
ఈ క్రమంలో తాజాగా తన భార్య ముక్కు కొరికేశాడు భర్య. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదమే ఈ ఘటనకు కారణం అని తెలుస్తోంది.
By: Tupaki Desk | 12 July 2025 2:00 PM ISTకష్టసుఖాల్లో తోడుంటూ ఆనందంగా బ్రతకాల్సిన దాంపత్య జీవితంలో ఇటీవల కాలంలో నేరాలు-ఘోరాలు కనిపిస్తున్నాయి. అయితే మర్డర్ కుదరకపోతే అంటంప్ట్ టు మర్డర్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ముక్క ఊడే స్థాయిలో, ముఖమంతా నెత్తురు కారేలా భార్య ముక్కు కొరికిన భర్త వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అవును... ఈ మధ్య కాలంలో భార్యభర్తల మధ్య నెలకొంటున్న నేరాలు, ఘోరాల ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నో హత్యల ఘటనలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా తన భార్య ముక్కు కొరికేశాడు భర్య. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదమే ఈ ఘటనకు కారణం అని తెలుస్తోంది.
వివరాళ్లోకి వెళ్తే... కర్ణాటకలోని దావణగెరెలో ఓ మహిళ తన భర్త పూచీకత్తుతో అప్పు తీసుకుంది. అయితే తగిన సమయంలో తిరిగి రుణం చెల్లించడంలో ఆమె విఫలమైంది. ఈ క్రమంలో ఫైనాన్స్ వాళ్లు ఆమె భర్తపై ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు, అది కాస్తా వేధింపుల వరకూ వెళ్లింది. దీంతో... ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.
ఆ గొడవ కాస్తా చినికి చినికి గాలివానగా మారింది.. ఈ సమయంలో తన భార్యను నేలపైకి తోసేశాడు ఆమె భర్త. దీంతో ఆమె కిందపడిపోయింది. అక్కడితో తన ఆగ్రహం చల్లారలేదో ఏమో కానీ... ఆమెపై పడి తన భార్య ముక్కును కొరికేశాడు. దీంతో... నొప్పి భరించలేకపోయిన ఆ మహిళ సాయం కోసం ఏడుస్తూ బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించింది.
ఆ కేకలు, ఆమె ఏడుపు వినిపించిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయిన మహిళను ప్రభుత్వాస్పతికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
కాగా ఇలా ముక్కులు కొరుకేసుకునే ఘటన మే నెలలో ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. యూపీలోని కాన్పూర్ లో కారు పార్కింగ్ విషయంలో జరిగిన వివాదంలో ఒక వ్యక్తి రెసిడెన్షియల్ సొసైటీ కార్యదర్శి ముక్కును కొరికాడు. నరమౌ ప్రాంతంలోని రతన్ ప్లానెట్ రెసిడెన్షియల్ సొసైటీలో ఈ ఘటన జరిగింది!
