Begin typing your search above and press return to search.

హనీ ట్రాప్ : కొడుకు కాదు నీచుడు.. తల్లితోనే పాపం పనులు!

రానురాను సమాజం ఎటుపోతుందో చెప్పలేకపోతున్నాం.. కుటుంబ విలువలు, సంస్కారం అనేవి మచ్చుకైనా కనిపించడం లేదు.

By:  Tupaki Desk   |   20 Nov 2025 8:00 PM IST
హనీ ట్రాప్ : కొడుకు కాదు నీచుడు.. తల్లితోనే పాపం పనులు!
X

రానురాను సమాజం ఎటుపోతుందో చెప్పలేకపోతున్నాం.. కుటుంబ విలువలు, సంస్కారం అనేవి మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బే పరమావధిగా మారిపోవడంతో కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ఓ హనీట్రాప్ ఉదంతం పరిశీలిస్తే.. తల్లి కొడుకుల బంధానికే అవమానంగా చెప్పాల్సి వస్తోంది. కర్ణాటకలోని ఇండి అనే చిన్న పట్టణంలో ఓ బ్యాంకు మేనేజర్ నుంచి డబ్బు గుంజుకోడానికి 24 ఏళ్ల యువకుడు చేసిన పని విస్మయానికి గురి చేసింది. కన్నతల్లినే ఉపయోగించి బ్యాంకు మేనేజరును ట్రాప్ చేశాడా పాపాత్ముడు.

పోలీసుల కథనం ప్రకారం ఇండి పట్టణానికి చెందిన బ్యాంకు మేనేజర్ ఒకరికి బ్యాంకు సమీపంలో కొబ్బరి బొండాలు విక్రయించే మహిళతో పరిచమైంది. అది స్నేహంగా మారింది. నవంబరు 1న తాను ఇంట్లో ఒంటరిగా ఉంటానని, రమ్మనమని అతడిని ఆ మహిళ ఆహ్వానించింది. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు కిటికీలో సెల్ ఫోన్ పెట్టి ఆ సీన్లు వీడియో తీసింది. దాన్ని ఆ మేనేజరు గుర్తించి నిలదీస్తే ఆ సెల్ ఫోన్ పనిచేయదని చెప్పి బుకాయించింది.

ఆ తర్వాత నవంబరు 5న బ్యాంకు మేనేజరుకు ఫోన్ చేసిన సదరు మహిళ.. తమ రొమాన్స్ ను ఎవరో వీడియో తీశారని, డబ్బులు కోసం బెదిరిస్తున్నట్లు చెప్పింది. ఆ విషయం విన్న వెంటనే కంగుతిన్న మేనేజర్.. వారితో మాట్లాడి సమస్య సెటిల్ చేసుకుందామని చెప్పాడు. ఇక ఆ తర్వాత మహిళ కుమారుడు అమూల్, అల్లుడు మహేశ్, స్థానికంగా ఓ పత్రికలో పనిచేస్తున్న విలేకరి కలిసి ఓ ముఠాగా ఏర్పడి బాధితుడిని బెదిరించడం ప్రారంభించారు.

రూ.10 లక్షలు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ముందుగా మహిళ కుమారుడైన అమూల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేసరికి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విషయం తెలిసి మహిళ మిగిలిన ఇద్దరు పరారయ్యారు. బ్యాంకు మేనేజర్ ను మోసగించినట్లే ఆ మహిళను అడ్డుపెట్టుకుని కుమారుడు, అల్లుడు పలువురిని మోసం చేశారని, లక్షల రూపాయల డబ్బు గుంజుకున్నారని పోలీసుల విచారణలో బయటపడింది.