నేను శివకుమార్.. సిద్దూను కాదు: డీకే వార్నింగ్
తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించిన శివకుమార్‌కు పదవులు దక్కని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మాజీ మంత్రుల నుంచి తీవ్రస్థాయిలో సెగ తగులుతోంది.
By: Garuda Media | 5 Aug 2026 12:19 PM ISTకర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవా రం ఉదయం 7 గంటలకు ఆయన తన నివాసంలో కొత్త మంత్రులకు బ్రేక్ ఫాస్ట్ విందు ఇచ్చారు. ఈ సమయంలో డీకే మాట్లాడుతూ.. ``నేను శివకుమార్‌ని. సిద్దూను కాదు`` అని వ్యాఖ్యానించారు. ఈ సమ యంలో మాజీ సీఎం సిద్దరామయ్య కూడా ఆయన పక్కనే కూర్చున్నారు. అయితే.. శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై సిద్దూ నవ్వి ఊరుకున్నారు.
ఎందుకిలా?
సీఎం శివకుమార్.. ఇలా వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. గతంలో తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న సమయంలో అప్పటి సీఎం సిద్దరామయ్య అనుచరులు.. శివకుమార్‌కు పదవి ఇచ్చేది లేదని ప్రచారం చేశారు. అంతేకాదు.. దీనిపై చర్చ కూడా అనవసరమని, సిద్దూనే ఐదేళ్లు ముఖ్యమంత్రి గా ఉంటారని కూడా చెప్పారు. ఆ సమయంలోనూ శివకుమార్.. ``నేను శివకుమార్.. సిద్దూను కాదు`` అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి సీఎం పదవిని చేపట్టారు.
తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించిన శివకుమార్‌కు పదవులు దక్కని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, మాజీ మంత్రుల నుంచి తీవ్రస్థాయిలో సెగ తగులుతోంది. మొత్తం 34 మంది మంత్రులకు అవకాశం ఉండగా.. ప్రస్తుతం 33 మంది మంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవుల పందేరం దాదాపు పూర్తయిం ది. అయినప్పటికీ.. కొందరు మాత్రం ఈ విషయంలో యాగీ చేస్తున్నారు. తమ పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. అయితే.. దీనిపై శివకుమార్ కూడా ఘాటుగానే స్పందించారు.
``మంత్రి పదవులకు రాజీనామా చేస్తే.. స్వాగతిస్తాం. తక్షణం ఆమోదిస్తాం. బుజ్జగించడం.. బ్లాక్ మెయిల్ చేసే వారికి అనుకూలంగా వ్యవహరించడం వంటివి నాకు తెలియదు. నేను పాత సీఎంను కాదు. నాకొక స్ట్రాటజీ ఉంది. దాని ప్రకారమే వెళ్తా. పార్టీ అధిష్టానం ఏం చెబితే.. దాని ప్రకారమే నడుచుకుంటా.`` అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం సిద్దరామయ్య పాల్గొన్నా.. ఆయన గురించే శివకుమార్ వ్యాఖ్యానించినా.. ఆయన మౌనంగా ఉండిపోయారు. మొత్తంగా క ర్ణాటకపై శివకుమార్ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారనడానికి ఇది ఉదాహరణగా నిలిచింది.
