సీఎం విజయ్ సిఫార్సు: జగన్‌కు వ్యూహకర్త దొరికినట్టేనా?
తమిళనాడులో ఘన విజయాన్ని దక్కించుకున్న నటుడు, టీవీకే జోసెఫ్ విజయ్ వెనుక.. కీలక వ్యూహకర్త పనిచేశారు.
By: Garuda Media | 16 July 2026 3:00 PM ISTతమిళనాడులో ఘన విజయాన్ని దక్కించుకున్న నటుడు, టీవీకే జోసెఫ్ విజయ్ వెనుక.. కీలక వ్యూహకర్త పనిచేశారు. ఆయనే.. కపిల్ సాహు. ఈయన కూడా మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంకు చెందిన సభ్యుడే కావడం గమనార్హం. ఆయన దగ్గర పనిచేసిన వారు.. జట్లుగా విడిపోయారు. ఈ క్రమంలోనే గతంలో జగన్‌కు రుషిరాజ్‌సింగ్ వ్యూహకర్తగా పనిచేశారు. అయితే.. ఆయన వ్యూహాలు బెడిసి కొట్టాయి. ఫలితంగా జగన్ 11 స్థానాలకు పరిమితం అయ్యారు.
ఆ తర్వాత.. జగన్ సపరైన వ్యూహకర్త కోసం వెతుకుతున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పటి వరకు ఎవరూ లభించలేదని సమాచారం. ఈ క్రమంలో తాజాగా వైసీపీ వర్గాల మధ్య జరుగుతున్న చర్చల మేరకు.. జగన్‌కు వ్యూహకర్త దొరికాడని.. ప్రస్తుతం చర్చల దశలో ప్రక్రియ నడుస్తోందని అంటున్నారు. ఈ ఏడాది జరిగిన తమిళనా డు ఎన్నికల్లో టీవీకే తరఫున పనిచేసిన సాహు.. జగన్‌కు కూడా పనిచేయనున్నారని తెలుస్తోంది. స్వయంగా తమిళనాడు సీఎం విజయ్ ఆయనను సిఫారసు చేశారని మరికొందరు చెబుతున్నారు.
తమిళనాడు ఎన్నికల సమయంలో విజయ్ ప్రసంగాలు, ఎక్కడా పరుష పదజాలం వాడకుండా.. ప్రజలను ఆకట్టు కున్న తీరు వెనుక సాహు వ్యూహమే ఉందని అంటున్నారు. అలాగే.. ప్రజలపై ఎన్నికల హామీలను కురిపించడం వెనుక కూడా ఆయన రూపొందించిన మ్యానిఫెస్టోనే కీలకంగా పనిచేసిందని అంటున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపిక నుంచి పార్టీలో నేతల సమన్వయం.. ప్రజలను కలుసుకునే తీరు ప్రసంగాలు ఇలా అన్నీ తానై వ్యవహరించిన సాహు.. విజయ్ విజయంలో కీలక రోల్ పోషించారని చెబుతారు.
ఈ క్రమంలోనే విజయ్ ఆయనను జగన్‌కు సిఫారసుచేసి ఉంటారని వైసీపీ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది. తాజాగా ఓ నాయకుడు పరోక్షంగా ఈ విషయాన్ని బయట పెట్టడం గమనార్హం. తమకు కూడా ఓ వ్యూహకర్త దొరికాడని ఆయన చెప్పడం వెనుక సాహునే రీజన్ అని సమాచారం. అయితే.. విజయ్ కు జగన్‌కు పోలికల్లో చాలా తేడా ఉంది. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి.. కానీ, జగన్ పాలనను జనం ఐదేళ్లు చూసిన దరిమిలా.. సాహు కనుక వ్యూహకర్తగా మారితే అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. తమిళ రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు కూడా చాలా తేడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
