Begin typing your search above and press return to search.

కేఏ పాల్ బంపరాఫర్: గూగుల్ పే‌ చెయ్యండి.. టిక్కెట్ పట్టండి!

అవును... తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారడంతోపాటు అత్యంత సీరియస్ గా జరుగుతున్నాయని కథనాలొస్తున్న తరుణంలో... తాజాగా కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 3:56 PM GMT
కేఏ పాల్  బంపరాఫర్: గూగుల్  పే‌ చెయ్యండి.. టిక్కెట్  పట్టండి!
X

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు చాలా సీరియస్ గా మారిపోయాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అధికార బీఆరెస్స్ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారానికి తెరలేపేసింది. మరోపక్క కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఆల్ మోస్ట్ ఫైనల్ కు తెచ్చేశాయని అంటున్నారు. మరోపక్క ఎన్నికల కమిషన్ పోలింగ్ డేట్ ఇచ్చేసింది. ఈ సమయంలో కేఏ పాల్ తనదైన ఎంట్రీ ఇచ్చారు.

అవును... తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారడంతోపాటు అత్యంత సీరియస్ గా జరుగుతున్నాయని కథనాలొస్తున్న తరుణంలో... తాజాగా కేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని.. ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో వారం రోజుల్లోగా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తానని కేఏ పాల్ ప్రకటించారు.

ఈ సమయంలో ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నవారి ప్రస్థావన తీసుకొచ్చారు కేఏ పాల్. ఇందులో భాగంగా... చాలా మంది ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కోట్లు కుమ్మరించి కాంగ్రెస్ టిక్కెట్ కోసం తాపత్రయం పడుతున్నారని, కానీ ఆయా పార్టీలు అవకాశం కల్పించట్లేదని విచారం వ్యక్తం చేసిన ఆయన... అలాంటి వాళ్లందరికీ తాను అవకాశం కల్పిస్తానని అభయం ఇచ్చారు.

ఇదే క్రమంలో... ప్రజాశాంతి పార్టీ తరపున బీసీలకు 60 శాతం, మహిళలకు 33 శాతం టికెట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించిన కేఏ పాల్... తెలంగాణలో ఎక్కువ శాతం ఉన్న బీసీల నుంచి ఒక అభ్యర్థిని సీఎం చేద్దామని సూచించారు. ఈ సమయంలో తెలంగాణలో ప్రజారాజ్యం పార్టీ తరుపున టిక్కెట్ ఆశించే ఆశావహులకు ఆయన ఒక బంపరాఫర్ ప్రకటించారు.

ఇందులో భాగంగా... తన పార్టీ తరపున పోటీ చేయాలనుకునే వారు.. వారం రోజుల్లోగా తన అకౌంట్‌ కు రూ.10 వేలు గూగుల్ పే చేసి, దరఖాస్తు పంపాలని సూచించారు. ఇదే సమయంలో... పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే 3 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.

అనంతరం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించిన పాల్... నవంబర్ 30న కేసీఆర్‌ గుడ్ బై అనాలంటే ముందు కాంగ్రెస్‌ కు కూడా ప్రజలు గుడ్ బై చెప్పాలని అన్నారు. ఇక.. అంబేద్కర్, గద్దర్ ఆశయాలు బ్రతకాలంటే ప్రజా శాంతి పార్టీ గెలవాలని.. ఎవరైనా ప్రజలకు సేవ చేయాలంటే ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు కేఏ పాల్!