Begin typing your search above and press return to search.

రెండో పెళ్లి వద్దన్న భార్యను కత్తితో పొడిచేసిన బుల్లితెర నటుడు?

ఈ నేపథ్యంలో సదరు టీవీ నటుడిపై అతడి భార్య తాజాగా కర్ణాటక పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   24 July 2024 10:57 AM IST
రెండో పెళ్లి వద్దన్న భార్యను కత్తితో పొడిచేసిన బుల్లితెర నటుడు?
X

కన్నడ బుల్లితెర నటుడి నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. కట్టుకున్న భార్యను కత్తిపోట్లకు గురి చేసిన ఈ దుర్మార్గం షాకింగ్ గా మారింది. ఇంతకూ ఆమెను అంతలా గాయపర్చటానికి కారణం.. అతగాడు ఇంకో పెళ్లి చేసుకుంటానంటే.. అందుకు నో చెప్పటమే కారణం. ఈ నేపథ్యంలో సదరు టీవీ నటుడిపై అతడి భార్య తాజాగా కర్ణాటక పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పలు సీరియల్స్ లో నటించే కన్నడ టీవీ నటుడు సన్నీ మహిపాల్ సుపరిచితుడు. నేత్రావతి సీరియల్ తో అతడికి మంచి పేరు వచ్చింది. అతడిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అయితే.. అతగాడు లా కాలేజీలో చదువుకునే తాను పరిచయం అయ్యానని.. ఆ తర్వాత తమ మధ్య పెరిగిన పరిచయంతో ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నట్లుగా బాధితురాలు పేర్కొంది.

అయితే.. అతడు తాజాగా మరో యువతిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతున్నాడని.. ఆ విషయం తనకు తెలిసి ఎంగేజ్ మెంట్ జరిగే చోటు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా ఆగ్రహానికి గురైన సన్నీ.. తనను కత్తితో పొడిచాడని ఆరోపిస్తోంది. బాధితురాలి నుంచి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఆమెను చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

ఈ ఉదంతంపై సన్నీ స్పందించారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి దాడి చేసినట్లుగా చెబుతున్నారు. ఆమెతో సన్నీకి పెళ్లైందా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.