Begin typing your search above and press return to search.

కంగనా పొలిటికల్ ఎంట్రీ... కన్ ఫాం చేసిన ఆమె తండ్రి!

అవును... బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై గతకొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Dec 2023 11:15 AM GMT
కంగనా పొలిటికల్  ఎంట్రీ...  కన్  ఫాం చేసిన ఆమె తండ్రి!
X

బాలీవుడ్‌ లో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రేక్షకుల‌ను అల‌రించడంతో పాటు.. వివాదాలకూ కేరాఫ్ అడ్రస్ అనే పేరు సంపాదించుకున్న కంగ‌నా ర‌నౌత్‌... హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ఆమె పొలిటికల్ ఎంట్రీపై చాలా కాలం నుంచే రకరకాల కథనాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆమె పొలిటికల్ ఎంట్రీపై ఆల్ మోస్ట్ ఒక క్లారిటీ వచ్చింది.

అవును... బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పొలిటికల్ ఎంట్రీపై గతకొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనే ఆమె ఈ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత నెలలో ఈ విషయంపై స్పందించిన ఆమె... శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. ఆ సంద‌ర్భంలో తన పొలిటిక‌ల్ ఎంట్రీపై మరింత వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇటీవల గుజరాత్‌ లోని ప్రఖ్యాత శ్రీకృష్ణాలయం "ద్వారకాధీష్"ను సంద‌ర్శించిన కంగ‌నా రనౌత్... త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై స్పందించారు. "శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే నేను పోరాడతాను" అని ఆమె తెలిపారు. ఈ క్రమంలో సుమారు ఆరువంద‌ల ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సాధ్యమైందని.. ఇది కూడా బీజేపీ నేతృత్వంలోనే జ‌రిగింద‌ని, ఈ సంద‌ర్భంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించారు.

ఈ క్రమంలో తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన రెండు రోజుల తర్వాత ఆమె పొలిటికల్ ఎంట్రీపై మరింత నిర్ధారణ వచ్చింది. ఇందులో భాగంగా... బీజేపీకి మద్దతుగా నిల్చే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 2024 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ పై పోటీ చేయనున్నారని ఆమె తండ్రి తాజాగా ధృవీకరించారు. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చింది.

కాగా... 2019లోనే కంగనా రనౌత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బీజేపీ హైకమాండ్‌ తో ఆమె పొలిటికల్ ఎంట్రీ ప్రస్తావనలు ఏ మాత్రం అనుకూలంగా లేవని పుకార్లు వినిపించాయి. అయితే ఇటీవల కాలంలో ఆమె ఎంట్రీకి నరేంద్ర మోడీ, అమిత్ షాలు సానుకూలంగా ఉన్నారని అంటున్నారు.