Begin typing your search above and press return to search.

జ‌నసేన 'మంత్రి' గారి రాజ‌కీయం అద‌ర‌హో.. !

ఇంకా ఎవ‌రైనా గ‌ట్టిగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేసినా.. ఆయ‌న మాత్రం చాలా చ‌క్క‌గా ఎక్క‌డా దుర్భాష‌లు లేకుండా స‌మాధానం ఇస్తారు. ఆయ‌నే.. మంత్రి కందుల దుర్గేష్‌.

By:  Garuda Media   |   28 March 2026 8:00 AM IST
జ‌నసేన మంత్రి గారి రాజ‌కీయం అద‌ర‌హో.. !
X

ఆయ‌న వివాదాల‌కు క‌డు దూరం. ఎవ‌రు ఏమ‌న్నా.. విమ‌ర్శ‌లు చేసినా.. మౌనంగా వింటారు. చిరున‌వ్వుతో వాటికి బ‌దులిస్తారు. ఇంకా ఎవ‌రైనా గ‌ట్టిగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేసినా.. ఆయ‌న మాత్రం చాలా చ‌క్క‌గా ఎక్క‌డా దుర్భాష‌లు లేకుండా స‌మాధానం ఇస్తారు. ఆయ‌నే.. మంత్రి కందుల దుర్గేష్‌. తొలిసారి గ‌త ఎ న్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న దుర్గేష్‌.. జ‌న‌సేన పార్టీలో అత్యంత విన‌య‌శీలిగా.. ఓర్పుగ‌ల నాయ‌కు డిగా కూడా పేరు తెచ్చుకున్నారు.

నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న దుర్గేష్‌... చాలా ఓర్పుతో నేర్పుతో ప‌నులు చ‌క్క‌బెడుతున్నారు. నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గం వాస్త‌వానికి టీడీపీకి కంచుకోట‌. అయితే.. 2019లో ఫ‌స్ట్ టైమ్ ఇక్క‌డ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ ప‌ట్టును పెంచుకుంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో ఈక్వేష‌న్ల‌లో తేడా వ‌చ్చి.. రాజ‌మండ్రి రూర‌ల్‌కు వెళ్లాల్సిన దుర్గేష్‌.. నిడ‌ద‌వోలు నుంచి పోటీ చేశారు. ఆయ‌న గెలుపు విష‌యంలో టీడీపీ శ్రేణులు బాగానే ప‌నిచేశాయి.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీకి టీడీపీ సిద్ధ‌మ‌వుతోంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలానూ రాజ‌మండ్రి రూరల్ ఖాళీ అవుతుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రిటైర‌య్యే అవ‌కాశం ఉంది. కానీ, ఆయ‌న మాత్రం.. తానే పోటీ చేస్తాన‌ని అంటున్నారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఒక‌విధ‌మైన రాజ‌కీయ చ‌ర్చ అయితే జ‌రుగుతోంది. నిడ‌ద‌వోలులో బూరుగుప‌ల్లి వ‌ర్గం దూకుడుగానే ఉంది.

అయితే.. అటు రాజ‌మండ్రి రూర‌ల్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలైనా.. ఇటు నిడ‌ద‌వోలులో జ‌రుగుతున్న రాజ‌కీయ అంశాల‌నైనా.. మంత్రి కందుల దుర్గేష్ లైట్ తీసుకుంటున్నారు. ఎవ‌రినీ ఆయ‌న పెద్దగా ప‌ట్టిం చుకోవ‌డం లేదు. అంతేకాదు.. ఏ స‌మ‌స్య వచ్చినా.. దుర్గేష్ చిరున‌వ్వుతో స్వీక‌రిస్తున్నారు. వివాదాల‌ను త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రిస్తున్నారు. త‌న‌ను ఎవ‌రు క‌ల‌వాల‌ని అనుకున్నా.. ఎవ‌రు మాట్లాడాల‌ని అనుకున్నా.. వెంట‌నే అందుబాటులో ఉంటూ.. ఎవ‌రినీ నొప్పించ‌కుండా ముందుకు వెళ్తున్నారు. ఇలా.. మంత్రిగారి రాజ‌కీయం అద‌ర‌హో అన్న విధంగా ముందుకు సాగుతున్నారు.