Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేగా కవిత ఎందుకు పోటీ చేయలేదో తెలుసా....?

ఇక కవితను ఎమ్మెల్యేగా పోటీలోకి దించితే బీజేపీ కాంగ్రెస్ నుంచి గట్టి అభ్యర్ధులను పెట్టి ఆమెను ఓడిస్తారు అన్న భయం కూడా కేసీయార్ లో ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:19 AM GMT
ఎమ్మెల్యేగా కవిత ఎందుకు పోటీ చేయలేదో తెలుసా....?
X

బీయారెస్ అధినేత ముఖ్యమంత్రి కేసీయార్ కుమార్తె అయిన కవిత ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయలేదు. ఈ డౌట్ అందరికీ కలుగుతుంది కదా. నిజం చెప్పాలంటే దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ ఎన్నికలు బీయారెస్ కి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ఎందుకంటే హ్యాట్రిక్ విజయం సాధించాలని బీయారెస్ ఉవ్విళ్ళూరుతోంది. అలాంటి ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ముందు పెట్టి ఎన్ని వీలు అయితే అన్ని సీట్లు తెచ్చుకోవడం ఏ పార్టీకి అయినా ఒక రాజకీయ వ్యూహంగా ఉంటుంది.

మరి కేసీయార్ కుమార్తె. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, మహిళా నాయకురాలు అయిన కవిత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుపు గుర్రం అవుతుంది కదా. జనాలకు ఆమె బీయారెస్ లో కీలక నాయకురాలిగానే భావించే సీన్ ఉంది. బీయారెస్ టాప్ లీడర్స్ లో ఒకరైన కవిత ఎందుకు పోటీ చేయలేదు. ఇది చాలా పెద్ద ప్రశ్నగానే ఉంది మరి.

ఇక కవిత విషయం తీసుకుంటే ఆమెను ఎంపీగా పోటీ చేయించారు. రెండు సార్లు ఆమె పోటీ చేస్తే 2014లో గెలిచారు, 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత ఎమ్మెల్సీ అయ్యారు. ఇక ఆమెను 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయించాలాని బీయారెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. అయితే కవిత విషయం తీసుకుంటే మాత్రం ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీకి రావాలని ఉంది అని అంటున్నారు.

ఇక కవిత మనసు ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్రంలో మూడవ సారి బీయారెస్ అధికారంలోకి వస్తే మంత్రిగా పనిచేయాలని ఉంది అంటున్నారు. మరి దీని మీద ఆమె కేసీయార్ తో చర్చించారని, కానీ కేసీయార్ అయితే ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అసలు ఒప్పుకోలేదని అంటున్నారు.

ఇక కవితను ఎమ్మెల్యేగా పోటీలోకి దించితే బీజేపీ కాంగ్రెస్ నుంచి గట్టి అభ్యర్ధులను పెట్టి ఆమెను ఓడిస్తారు అన్న భయం కూడా కేసీయార్ లో ఉంది అని అంటున్నారు. ఆమెను 2019లో నిజామాబాద్ ఎన్నికల్లో బీజేపీ అలాగే ఓడించింది. దాంతో అప్పటి నుంచి కవిత గెలుపు మీద బీయారెస్ అధినాయకత్వానికి కొంత నమ్మకం తగ్గింది అని అంటున్నారు.

కవితను రాష్ట్ర రాజకీయాల్లోకి కేసీయార్ ఎపుడో తీసుకుని వచ్చారు. ఆమెను ఎమ్మెల్సీని చేయడం అంటే అదే కదా అని అంటున్నారు. అలాంటి కవితను ఎమ్మెల్యేగా రాజమార్గంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకోవచ్చు కదా అని మేధావులు అంటున్నారు.

ఇక కవితను నిజామాబాద్ బరి నుంచి పోటీ చేయించాలి. అలా కనుక చేస్తే అక్కడ నిజమాబాద్ ఎంపీగా ఉన్న బీజేపీ నేత ధర్మపురి అరవింద్ పోటీ చేసి ఆమెను ఓడించే ప్రయత్నం కచ్చితంగా చేస్తారు అని కూడా బీయారెస్ లో ఒక రకమైన ఆందోళన ఉంది అని అంటున్నారు.

ఇక కవిత విషయం తీసుకుంటే ఆమెకంటూ ఒక గ్యారంటీ సీటు లేకపోవడం వల్ల కూడా పోటీ చేయించేందుకు అధినాయకత్వం జంకిందని అంటున్నారు. అయితే కేసీయార్ ఈసారి రెండు సీట్లలో పోటీ చేస్తున్నారు. అందులో ఒకటి గజ్వేల్ రెండవది కామారెడ్డి. ఈ రెండింటిలో కేసీయార్ కావాలని వ్యూహాత్మకంగా పోటీకి దిగారని అంటున్నారు. రెండు సీట్లలో గెలిస్తే గజ్వేల్ సీటుని కేసీయార్ వదులుకుని తన కుమార్తె కవితకు ఇస్తారని అంటున్నారు. అపుడు ఆయన కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటారని అంటున్నారు.

గజ్వేల్ లో కేసీయార్ గత రెండు ఎన్నికల నుంచి వరసగా గెలుస్తున్నారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ విజయం అవుతుంది. అలా తన సొంత సీటునే కవితను ఇచ్చేందుకు కేసీయార్ రెండో సీటుగా కామారెడ్డిని ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి కవిత విషయంలో కేసీయార్ పెద్ద ప్లాన్ తోనే ఉన్నారని అంటున్నారు.

మూడవసారి బీయారెస్ అధికారంలోకి వస్తే కచ్చితంగ కవితను రాష్ట్ర రాజకీయాల్లో కేసీయార్ ప్రవేశపెడతారు అని అంటున్నారు. అందుకోసమే ఆయన ఇపుడు టికెట్ ఇవ్వలేదు అని అంటున్నారు. మొత్తానికి కేసీయార్ ఫ్యామిలీలో కొడుకు కేటీయార్, మేనల్లుడు హరీష్ రావు ఉన్నారు. ఇపుడు కవితను కూడా అసెంబ్లీలోకి తీసుకుని వస్తే పరిపూర్ణమైన కుటుంబ రాజకీయం అవుతుంది అని అంటున్నారు.