Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ లో..

ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దాదాపు రెండు గంటల పాటు విచారించిన అధికారులు చివరకు ఆమె అరెస్ట్ కు మొగ్గు చూపారు

By:  Tupaki Desk   |   15 March 2024 3:06 PM GMT
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ లో..
X

తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మధ్యాహ్నం కవిత ఇంటికి చేరుకుని ఆమె ఇంట్లో సోదాలు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దాదాపు రెండు గంటల పాటు విచారించిన అధికారులు చివరకు ఆమె అరెస్ట్ కు మొగ్గు చూపారు. దీనిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.

ఉద్రిక్తత

ఈ సందర్భంగా కవిత నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకుని అధికారుల తీరును విమర్శించారు. కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా ఈడీ ఎలా అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు. దీనిపై ఈడీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

కవిత ఏం చేస్తుంది?

ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆమె న్యాయపరమైన చర్యలు ఏం తీసుకుంటుంది. తన తదుపరి కార్యాచరణ ఏమిటనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉండగానే ఈడీ అరెస్ట్ తో ఈడీపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో ఇదివరకే ఈడీ పలు నోటీసులు ఇచ్చినా వాటికి సమాధానం ఇవ్వలేదనేది ఈడీ వాదన.

చట్టం ఏ చెబుతుంది?

కవిత అరెస్టు పై చట్టపరమైన చిక్కులు ఏముంటాయి? ఆమె అరెస్ట్ సబబేనా? అనే కోణంలో పలు సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో మద్యం కేసు విచారణలో ఉండగానే ఆమెను అరెస్టు చేయడంతో ఏం జరుగుతుందోననే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రేపు కవితను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు.

ఢిల్లీకి తరలింపు

కవితను విమానంలో ఢిల్లీకి తరలించేందుకు ఆమె నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరడంతో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సహకరించారు.

కవిత వెంట ఎవరుంటారు?

కవిత వెంట ఢిల్లీకి ఎవరు వెళతారు? న్యాయ పోరాటం చేసేందుకు ఎవరు వెళతారో తెలియడం లేదు. ఆమె వెంట కేటీఆర్ ఉంటారని తెలుస్తోంది. కేసు సుప్రీంకోర్టులో ఉండగానే అరెస్టు చేయడం సమంజసం కాదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో న్యాయపోరాటం చేసి ఈడీ చర్యలను ఖండిస్తామని చెబుతున్నారు.

కవిత భర్తకు సమాచారం?

కవిత అరెస్టు గురించి ఆమె భర్త అనిల్ కు ముందే సమాచారం ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది. కవితపై 14 పేజీల్లో వివరిస్తూ మెమో జారీ చేసింది. సాయంత్రం 5.20 గంటలకు ఆమెను అరెస్ట్ చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కవిత అరెస్ట్ రాష్ట్రంలో ప్రకంపనలు కలిగిస్తోంది.