Begin typing your search above and press return to search.

కాళేశ్వరంలో అవినీతి... యావజ్జీవ శిక్ష కోరుతున్న మాజీ ఐఏఎస్!

ఇందులో భాగంగా... "ముమ్మాటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పుడు డిజైన్. లక్ష కోట్లు ప్రజల సొమ్మువృథా

By:  Tupaki Desk   |   21 Dec 2023 5:02 PM GMT
కాళేశ్వరంలో అవినీతి... యావజ్జీవ శిక్ష కోరుతున్న మాజీ ఐఏఎస్!
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచీ కాళేశ్వరం ప్రాజెక్ట్, అందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ వినిపిస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు సహా ఛత్తీస్‌ గఢ్‌ తో విద్యుత్‌ ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీ వాడకంపై న్యాయవిచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు.

ఇదే సమయంలో ఛత్తీస్‌ గఢ్‌ తో విద్యుత్‌ ఒప్పందం లోపభూయిష్టంగా ఉందని.. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందని.. దీంతో భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామనే రేవంత్ ప్రకటనతో ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఈ సమయంలో... రిటైర్డ్ ఐఏఎస్ మురళి స్పందించారు.

అవును... కేసీఆర్ సర్కార్ పూర్తి అవినీతిమయమైందని, పేద ప్రజల కడుపుకొట్టిందని నిత్యం సంచలన ఆరోపణలు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా ముమ్మాటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల లక్ష కోట్లు ప్రజల సొమ్మువృథా అయ్యిందని.. అందుకు బాధ్యులైన వారికి యావజ్జీవ శిక్ష పడేలా చేసి జైలుకు పంపాలని ఆయన సంచలన డిమాండ్ చేశారు!

ఇందులో భాగంగా... "ముమ్మాటికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పుడు డిజైన్. లక్ష కోట్లు ప్రజల సొమ్మువృథా. తప్పుడు డిజైన్ కు బాధ్యులు అయిన అధికారులు, ఇంజినీర్లు, మంత్రులు, కేసీఆర్ అయితే కేసీఆర్ ను ప్రాసిక్యూట్ చేసి యావజ్జీవ శిక్ష పడేటట్లు చేసి జైలుకు పంపాలి. భవిష్యత్తులో ఇంజినీర్లకు, అహంకార పూరిత/అవినీతి రాజకీయ నాయకులకు ఇది ఒక గుణపాఠం కావాలి" అంటూ సంచలన ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో... "లక్ష కోట్లు ఖర్చు పెడితే 3000 ఇంటర్నేషనల్ ప్రభుత్వ స్కూల్స్ (మండలానికి 5 - ఉచిత బస్సు రవాణా సౌకర్యంతో సహా), 119 రెండు వందల పడకల సూపర్ స్పెషలిటీ ప్రభుత్వ ఆస్పత్రులు (నియోజక వర్గానికి ఒకటి) వచ్చేవి" అని స్పష్టం చేశారు. దీంతో ఈ ఒక్క ట్వీట్ ఆసక్తికరంగా మారడంతోపాటు మరోసారి తెలంగాణలో అత్యంత హాట్ టాపిక్ గా మారింది.

కాగా... ధరణిలో అనేక మార్పులు చేస్తూ పటిష్టమైన భూమాత పోర్టల్ ను తీసుకు రావాలని నూతన ప్రభుత్వాన్ని ఆకునూరి మురళి ఇటీవల కోరిన సంగతి తెలిసిందే. వాయిస్ ఆఫ్ తెలంగాణ, సాదిక్ పౌండేషన్ ఆధ్వర్యంలో "ధరణిలో మార్పు రావాలి – భూమాత ఎలా ఉండాలి" అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు టాపిక్ తెరపైకి వచ్చి... యావజ్జీవ కారగార శిక్ష డిమాండ్ తెరపైకి తెచ్చారు!