'కేసీఆర్' చుట్టూనే కాళేశ్వరం వివాదం?!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూనే కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం ముసు రుకున్నట్టు తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 6 Jun 2025 8:28 PM ISTతెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూనే కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం ముసు రుకున్నట్టు తెలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు వెల్లడైన విషయాలు.. ప్రస్తుతం మా జీ మంత్రి, అప్పటి కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్.. వెల్లడించిన విష యాలను పరిగణనలోకి తీసుకున్న నిపుణులు.. ఈ వివాదం పూర్తిగాకేసీఆర్ చుట్టూనే ముసురుకుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా కాళేశ్వరం పేరుతో సొమ్ములు దోచుకున్నారన్నది అధికార పార్టీ కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. దీనికి తోడు హడావుడిగా నిర్మించిన మేడి గడ్డ కూడా కుప్పకూలడం మరింతగా నాటి బీఆర్ ఎస్ సర్కారు పై విమర్శలు వచ్చేలా చేసింది. అయితే.. తొలినాళ్లలో ఏమీలేదని బీఆర్ ఎస్ ఎదురు దాడిచేసింది. అంతేకాదు.. దమ్ముంటే విచారణ కూడా చేసుకోవాలని సవాల్ విసిరింది. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది.
ఇప్పటి వరకు ఈ కమిషన్ 36 మంది ఇంజనీర్లను, మరో 10 మందికిపైగా అధికారులను విచారించినట్టు సమాచారం. అయితే.. ఈ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఇంజనీర్ల విషయంలో మరింత గోప్యత పాటిస్తున్నారు. అదేవిధంగా 100 మందికి పైగా సాక్షులను కూడా విచారించారు. తాజాగా.. ఈటల రాజేందర్‌ను కూడా విచారించారు. ఇక్కడ ఎవరు ఎలాంటి సాక్ష్యాలు చెప్పారు? ఎలాంటి రుజువులు ఇచ్చారు.? అనేది పక్కన పెడితే.. ప్రధానంగా మూడు అంశాలు తెరమీదికివ చ్చాయి.
1) ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20 వేల కోట్ల రూపాయల పెంపు.
2) మేడిగడ్డ రిజర్వాయర్‌ను అంత హుటాహుటిన నిర్మించడానికి గల కారణాలు?
3) పారిశ్రామిక, తాగునీటి వినియోగంపై డబ్బు వసూలు చేయడం.
ఈ మూడు అంశాలపైనే ప్రధానంగా కమిషన్ దృష్టి పెట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు అంశాల్లోనే అక్రమాలు చోటు చేసుకున్నాయన్నది కాంగ్రెస్ నాయకులు కూడా చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుందని.. అంటున్నారు. కాగా.. ఈ నెల 11న కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో ఈటల రాజేందర్ చెప్పిన విషయాలు కూడా కీలకంగా మారనున్నాయి.
