Begin typing your search above and press return to search.

కళ తప్పిన కళా...ఈ సీనియర్ కి ఏమైంది...!?

శ్రీకాకుళం జిల్లాలో కిమిడి కళా వెంకటరావు సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన 1983 నుంచే టీడీపీలో ఉన్నారు.

By:  Tupaki Desk   |   23 March 2024 3:51 AM GMT
కళ తప్పిన కళా...ఈ సీనియర్ కి ఏమైంది...!?
X

శ్రీకాకుళం జిల్లాలో కిమిడి కళా వెంకటరావు సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన 1983 నుంచే టీడీపీలో ఉన్నారు. అన్న గారు పార్టీ పెట్టాక మొదటిసారి శ్రీకాకుళం ఉణుకూరు నుంచి గెలిచి సత్తా చాటారు అలా టీడీపీలో ఎన్టీఆర్ టైం లో మంత్రి అయ్యారు. ఉత్తరాంధ్రాలో ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుకీ కూడా ఏకైక హోం మంత్రి ఎవరూ అంటే కళా వెంకటరావు అని చెప్పాలి.

ఆయన రాజ్యసభకు వెళ్లారు. మళ్లీ తిరిగి ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇలా ఆయన రాజకీయం సుదీర్ఘంగా సాగింది. అయితే ఆయనకు 2019లో భారీ ఓటమి తరువాత మాత్రం దశ తిరగడం లేదు అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో కీలకంగా ఉండే ఈ నేతకు ఇపుడు టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ సాఉతోంది.

కళాను చీపురుపల్లి వెళ్ళమని చంద్రబాబు కోరుతున్నారు అని అంటున్నారు. కళా ఎచ్చెర్ల టికెట్ కోరుతున్నారు. ఈసారి తనకు పోటీ చేసే చాన్స్ ఇస్తే గెలిచి వస్తాను అని చెబుతున్నారు. అయితే అక్కడ మరో కీలక నేత ఉన్నారు. ఆయన కలిశెట్టి అప్పలనాయుడు. ఆయనకు జిల్లా టీడీపీ పెద్దల ప్రోత్సాహం ఉంది అని అంటున్నారు. కలి శెట్టికి ఈసారి టికెట్ ఇవ్వాలని పార్టీకి ఉంది అని అంటున్నారు.

అదే టైం లో బీజేపీకి ఈ టికెట్ ఇవ్వడానికి చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. మొత్తానికి చూస్తే కనుక కళాకు ఎచ్చెర్ల టికెట్ దక్కదు అన్నది ప్రచారంగా ఉంది. కళా ఒప్పుకుంటే చీపురుపల్లి నుంచి పోటీ చేయడం లేకపోతే రాజకీయాల నుంచి విరామం తీసుకోవడమే అని అంటున్నారు.

ఒకనాడు టీడీపీకి ఏపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన కళా వెంకటరావు ఈ రోజు తన టికెట్ కోసం ఎదురుచూపులు చూడడం అంటే బాధాకరం అని ఆయన అనుచరులు అభిమానులు అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ మూడవ విడత జాబితాను రిలీజ్ చేసింది. దాంట్లో కూడా కళా పేరు లేదు.అదే టైం లో ఎచ్చెర్లను కూడా అలా ఉంచేశారు. అదే విధంగా చీపురుపల్లిని ఉంచేశారు.

దీంతో కళాకు విషయం అర్ధం అయింది అని అంటున్నారు. ఆయన చీపురుపల్లిలో పోటీ చేయకపోతే ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. చంద్రబాబు లోకేష్ బాబులకు సన్నిహితుడైన కళాకు ఇపుడు టీడీపీ రాజకీయ కళ మసకబారడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది.