'కార్యకర్త'ల కేంద్రంగా మహానాడు.. పార్టీ హిస్టరీలో ఫస్ట్ టైం ఇలా...!
ఇంకా ఇస్తామని, కార్యకర్తలు లేనిదే పార్టీలేదని కూడా చంద్రబా బు ప్రకటించారు.
By: Tupaki Desk | 28 May 2025 9:28 PM ISTకడపలో జరుగుతున్న మహానాడు అనేక విషయాలకు వేదికగా మారింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ను హైలెట్ చేస్తూ.. ఆరు శాసనాలను ప్రకటించారు. గతంలో ఎన్టీఆర్.. సిద్ధాంతాలు ప్రకటించారు. ఇప్పు డు వాటిని కొనసాగిస్తూనే ఆరు శాసనాలను ప్రకటించడం ద్వారా.. నారా లోకేష్‌కు బాటలు పరుస్తున్నార న్న చర్చ కొనసాగుతోంది. ఇక, మరో కీలక విషయం పార్టీ కార్యకర్తలను హైలెట్ చేయడం.
సాధారణంగా ఏ పార్టీకైనా కార్యకర్తలే కీలకం. జెండా మోసేవారు లేకపోతే.. నాయకుడు మాత్రం ఏమీ చేయ లేని పరిస్థితి నెలకొంటుంది. ఆ జెండా మోసే కార్యకర్తలకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. అయితే.. టీడీపీ లో ఇప్పుడు మరింత ఎక్కువగా ప్రాధాన్యం దక్కుతోందన్న సంకేతాలను ఇస్తున్నారు. పార్టీ అధినేత చం ద్రబాబు నుంచి ఇతర నాయకుల వరకు కూడా కార్యకర్తలను కేంద్రంగా చేసుకుని ప్రసంగాలు చేస్తున్నా రు.
ఇలా ఆద్యంతం తొలి రోజు, మలి రోజు కూడా.. మహానాడులో కార్యకర్తల ప్రస్తావన ఎక్కువగా వినిపించింది. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఇంకా ఇస్తామని, కార్యకర్తలు లేనిదే పార్టీలేదని కూడా చంద్రబా బు ప్రకటించారు. ఇక, నారా లోకేష్ కూడా.. తన ప్రసంగాల్లో కార్యకర్తలనే ఎక్కువగా హైలెట్ చేయడం విశేషం. మొత్తంగా కార్యకర్తల చుట్టూ మహానాడు రాజకీయ ప్రసంగాలు తిరగడం ఇదే తొలిసారి. దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో నాయకుల వ్యవహార శైలి భిన్నంగా ఉం ది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు కట్టు తప్పకుండా చూసుకోవాలన్నది ఒక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. నాయకులు పోయినా.. కార్యకర్తల నుంచి నాయకులను ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక, రెండోది.. పదవుల వ్యవహారం. గత ఎన్నికల్లో కార్యకర్తలు బాగానే పనిచేశారు.
కానీ, ఆశించిన వారికి ఆశించినంత మేరకు పదవులు దక్కలేదు. వీరిని సంతృప్తి పరిచే కార్యక్రమంలో భాగంగానే మహానాడులో కార్యకర్తలను ప్రస్తావించడమనే భావన వ్యక్తమవుతోంది. ఏదేమైనా పార్టీలకు కార్యకర్తలే ముఖ్యం కాబట్టి.. ఇలా కార్యకర్తలను కాపు కాచుకునే కార్యక్రమం మంచిదేనని అంటున్నారు.
