టార్గెట్ కడప: టీడీపీ వర్సెస్ బీజేపీ.. !
ఇది కడప జిల్లాలో బిజెపి ఓటు బ్యాంకు ను పెంచుకునేందుకు, అదేవిధంగా ప్రజల్లో సంపతి తెచ్చుకు నేందుకు చేస్తున్న ప్రయత్నంగా పరిశీలకులు భావిస్తున్నారు.
By: Tupaki Desk | 28 July 2025 8:00 AM ISTవైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ఈ జిల్లాలో పట్టు సాధించాలన్నది అధికార టిడిపి నాయకులు పెట్టుకున్న లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను పది స్థానాల్లోనూ విజయం దక్కించుకోవాలని సీఎం చంద్రబాబు కూడా నిర్ణయించారు. ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు కూడా దిశా నిర్దేశం చేశారు. మహానాడు వేదికగా ఆయన దీనిపై సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని వైసిపికి గట్టి దెబ్బ కొట్టాలని కూడా ఆయన మహానాడు వేదికగా టిడిపి నాయకులకు తెల్చి చెప్పారు.
ఇది ఎంతవరకు సఫలమవుతుంది ఎంతవరకు విఫలమవుతుందనే విషయాలను పక్కన పెడితే ఇప్పుడు వైసీపీ కంటే ముందు బిజెపి నుంచి టిడిపికి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే కడప జిల్లా పై వ్యూహాత్మకంగా అడుగులు వస్తోంది. రాష్ట్రంలో బిజెపికి కొత్త అధ్యక్షులుగా నియమితులైన పివిఎన్ మాధవ్ కడప కేంద్రంగా రాజకీయాలు చేసేందుకు, కడప నుంచి రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. త్వరలోనే ఆయన కడప నుంచి యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇది కడప జిల్లాలో బిజెపి ఓటు బ్యాంకు ను పెంచుకునేందుకు, అదేవిధంగా ప్రజల్లో సంపతి తెచ్చుకు నేందుకు చేస్తున్న ప్రయత్నంగా పరిశీలకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గ నుంచి బిజెపి విజయం దక్కించుకుంది. ఇది ఆ పార్టీకి ఒక రకంగా కలిసి వచ్చిన అంశం. ఇది నాయకుడి వల్ల వచ్చిన విజయమా ..పార్టీ పరంగా దక్కిన విజయమా అనే విషయాన్ని పక్కన పెడితే జమ్మలమడుగులో అయితే బిజెపి విజయం దక్కించుకోవడం ఆ పార్టీకి ఒకరకంగా కలిసి వచ్చిన అంశం.
అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కూడా బిజెపి గెలిచింది. సో సీమలో బిజెపికి పట్టు ఉందన్న విషయాన్ని ఈ రెండు ప్రరిణామాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. దీంతో పివిఎన్ మాధవ్ సీమలో బలపడేలాగా వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా ఎదిగేలా బిజెపిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రకంగా టిడిపికి ఇబ్బందికరమైన పరిస్థితినే కల్పిస్తుంది. భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయా లేక ఎవరికి వారుగా రాజకీయాలు చేసుకుంటారా అనేది కూడా ఈ సందర్భంగా తేలిపోనుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
