Begin typing your search above and press return to search.

జూన్ 4న సంక్రాంతి దీపావళి ఒకేసారి వస్తాయట

అదేంటి సంక్రాంతి జనవరి నెలలో వస్తుంది కదా ఇక దీపావళి నవంబర్ లో వచ్చే పండుగ కదా అన్నది అందరికీ ఉన్న భావన. మరి ఈ రెండూ ఒకేసారి ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలీ అంటే తప్పకుండా రావాలని కూటమి నాయకులు అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 1:54 AM IST
జూన్ 4న  సంక్రాంతి దీపావళి ఒకేసారి వస్తాయట
X

అదేంటి సంక్రాంతి జనవరి నెలలో వస్తుంది కదా ఇక దీపావళి నవంబర్ లో వచ్చే పండుగ కదా అన్నది అందరికీ ఉన్న భావన. మరి ఈ రెండూ ఒకేసారి ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలీ అంటే తప్పకుండా రావాలని కూటమి నాయకులు అంటున్నారు.

అంతే కాదు ఆ రోజు కూడా జూన్ 4 అని చెబుతున్నారు. జూన్ 4 చూస్తే 2024 లో అదే రోజు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏపీ ప్రజలు బంపర్ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు అన్న మాట. ఆ విధంగా ఏపీకి సంక్రాంతి వచ్చిందని వైసీపీ అరాచకాలకు ఫుల్ స్టాప్ పడిందని జనసేన నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ అంటున్నారు.

అంతే కాదు అయిదేళ్ళుగా పట్టిన వైసీపీ పీడ అదే రోజుతో విరగడ అయింది కాబట్టి ప్రతీ ఇంట్లో టపాసులు కాల్చి మరీ దీపావళి పండుగ చేయాలని ఆయన కోరుతున్నారు. సంక్రాంతి ముగ్గులు ప్రతీ ఇంటి ముందు నాలుగవ తేదీన వేసి సంక్రాంతి చేసుకోవాలని సాయంత్రం అవుతూనే దీపావళి టపాసులు కాల్చాలని పిలుపు ఇచ్చారు.

ఇదిలా ఉంటే పిఠాపురంలో జనసేన నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ వైసీపీని గద్దె దించిన రోజు ఏపీ ప్రజలకు అతి పెద్ద పండుగ అన్నారు. అందుకే సంక్రాంతి దీపావళి వేడుకలను ఒకేసారి చేసుకోవాలని ఆయన కోరారు.

ఇదిలా ఉంటే జూన్ 4న ఏపీలో కూటమి పాలన వైఫల్యాలను ఎండగడుతూ వెన్నుపోటు దినాన్ని వైసీపీ ఆ రోజు నిర్వహిస్తోంది. అయితే అదే రోజున వైసీపీ పీడ విరగడైంది కాబట్టి దానికి సంకేతంగా రెండు పెద్ద పండుగలు ఒకేసారి కలిపి చేసుకోవాలని కూటమి నేతలు పిలుపు ఇస్తున్నారు.

మరి ప్రజలు ఎవరి మాట వింటారో ఏ వైపు ఉంటారో చూడాల్సి ఉంది. వైసీపీ చూస్తే ప్రజలకే కూటమి వెన్నుపోటు పొడిచింది అని ఆరోపిస్తూంటే వైసీపీకి జనాలు సమాధి కట్టారని కూటమి నేతలు అంటున్నారు. ఇక పోతే రాజకీయాల్లో ఉన్న వారికి గెలుపు ఓటములు సహజం. ప్రజలు ఒక పార్టీని ఎంచుకుని మరో పార్టీని ఓడించారు అంటే తప్పులు కరెక్ట్ చేసుకోమని వారికి ఒక చాన్స్ ఇచ్చారని అర్ధం అని అంటున్నారు. అయితే వర్తమాన కాలంలో ఓటమిని పార్టీలు తీసుకోలేకపోతున్నాయని అంటున్నారు. అలాగే గెలుపుని సైతం శాశ్వతం అనుకుంటున్నాయని అంటున్నారు.

రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ఎలా ఉన్నా వారు నిరసనలు చేసినా పండుగలకు పిలుపు ఇచ్చినా జనాలే ఇక్కడ కీలకం అని అంటున్నారు. వారికి ప్రజాస్వామ్యం ఎపుడూ పండుగే. అలాగే వారే అంతిమ ప్రభువులు కాబట్టి ఎవరు ఏమి చేసినా అంతిమంగా వారే న్యాయ నిర్ణేతలు అని అంటున్నారు. సో జూన్ 4న ఏమి జరుగుతుంది అన్నది ఆసక్తికరంగానే ఉంది.