ఎమెర్జెన్సీ మాత్రమే కాదు జగన్ కూడా !
ఆ తరువాత జూన్ 25న తొలిసారి కలెక్టర్ల సదస్సుని ప్రజావేదిక సమావేశ మందిరంలో నిర్వహించారు.
By: Tupaki Desk | 25 Jun 2025 11:53 PM ISTప్రతీ ఏడాదిలో కొన్ని రోజులు ఉంటాయి. వాటిని మంచికి లేక చెడుకు గుర్తుగా చెబుతూ ఉంటారు. అలా దేశంలో జూన్ 25ని ఎమెర్జెన్సీ చేదు రోజులకు గుర్తుగా చెబుతూ బీజేపీ ప్రచారం చేస్తూ వచ్చింది. అధికారంలోకి వచ్చాక జూన్ 25ని ఏకంగా రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా పేర్కొంటూ ఏటేటా కాంగ్రెస్ ని అలా బోనులో దోషిగా ఉంచి జనంలో ఎమెర్జెన్సీ నాటి చీకటి రోజులు అరాచక పాలన గురించి వివరిస్తూ వస్తోంది. కాంగ్రెస్ పాలన అంతా అలా నియంత పోకడలో సాగింది అని తరతరాలకు చాటడమే బీజేపీ ఉద్దేశ్యంగా ఉంది.
ఇక ఏపీలో కూడా జూన్ 25కి ఒక చెడ్డ రోజుగా చరిత్ర పుటలలో ఉంచే ప్రయత్నాన్ని టీడీపీ చేసింది. జూన్ 25 అంటే ఎమెర్జెన్సీ మాత్రమే కాదని జగన్ విషయంలోనూ అరాచకమైన పాలనకు మొదటి అడుగు పడిన రోజు అని టీడీపీ గట్టిగా చెబుతోంది. 2019లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
ఆ తరువాత జూన్ 25న తొలిసారి కలెక్టర్ల సదస్సుని ప్రజావేదిక సమావేశ మందిరంలో నిర్వహించారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ మాట్లాడుతూ కూల్చివేత అన్నది ప్రజావేదికతో మొదలు కావాలని చాలా గట్టిగా స్పష్టంగా అధికారులు ఆదేశాలు ఇస్తూ మాట్లాడిన వీడియోని టీడీపీ వీడియో రిలీజ్ చేసింది.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఏపీలో ఆరేళ్ళ క్రితం ఇదే రోజున విద్వంశం పాలనకు తొలి అడుగు పడింది అని గుర్తు చేశారు ప్రజావేదికను ఆనాటి వైసీపీ ప్రభుత్వం కూల్చేసి నియంతృత్వ పాలనకు తీర లేపింది అని ఆయన వ్యాఖ్యానించారు అయితే ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటు లేదని ప్రజలు ఓటుతో సరైన తీర్పును 2024లో ఇవ్వడం ద్వారా నిరూపించారు అని ఆయన అన్నారు. కూల్చివేతల పాలకులను ప్రజలు కూల్చేఇ పునర్ నిర్మాణ బాధ్యతలను కూటమి ప్రభుత్వానికి అప్పగించారు అని బాబు చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. అంతే కాదు జగన్ ప్రజావేదికను కూల్చివేయమని ఆదేశించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది.
మొత్తం మీదన చూస్తే కూటమిలో ఉన్న బీజేపీ జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీని ఎమర్జెన్సీని ఎండగడితే ఎమర్జెన్సీ కంటే తీవ్రమైన అరాచక పాలన 2019 నుంచి 2024 మధ్యలో ఏపీలో సాగింది అంటూ వైసీపీని జగన్ ని టార్గెట్ చేసింది. దీంతో ఇక మీదట ప్రతీ ఏడాది బీజేపీతో పాటు టీడీపీ కూడా జూన్ 25 ని గుర్తుంచుకుని మరీ జగన్ ప్రజావేదిక కూల్చుడుని తరతరాలకు ప్రచారం చేయడానికి శాశ్వతమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది అని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ నుంచి రియాక్షన్ ఏమిటో చూడాల్సి ఉంది.
