Begin typing your search above and press return to search.

32 నిమిషాల వ్యవధిలో ఏడు భూకంపాలు.. తెరపైకి బాబా వంగ జోస్యం!

అవును... మూడు రోజుల క్రితం జూలై 16 మధ్యాహ్నం అలాస్కా ద్వీపకల్పంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 July 2025 4:37 PM IST
32 నిమిషాల వ్యవధిలో ఏడు భూకంపాలు.. తెరపైకి  బాబా వంగ జోస్యం!
X

2025 జూలై నెలలో మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని.. సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన.. లేదా, అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఈ భారీ విపత్తు సంభవించొచ్చని.. ఇది మెగా సునామీ, భూకంపం రూపంలో ఉండొచ్చని బాబా వంగా జోస్యం ఇటీవల తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇది నిజం కాబోతుందా అనే ఘటన తాజాగా జరిగింది.

అవును... మూడు రోజుల క్రితం జూలై 16 మధ్యాహ్నం అలాస్కా ద్వీపకల్పంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో... రాష్ట్ర దక్షిణ తీరప్రాంతంలో ఉన్న ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచిస్తూ.. సునామీ హెచ్చరిక జారీ అయింది. ఈ క్రమంలో తాజాగా మరో పవర్ ఫుల్ భూకంపం రష్యాలో సంభవించింది.

రష్యాలోని ఫార్ ఈస్ట్ తీరంలో ఆదివారం 32 నిమిషాల వ్యవధిలో ఏడు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. దీనితో సునామీ హెచ్చరిక జారీ చేయబడింది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూ.ఎస్.జీ.ఎస్.) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో మొదట 5.0 తీవ్రతతో, తర్వాత వరుసగా 5.2, 5.7, 6.6, 6.7, 6.7 తీవ్రతతో భూమి కంపించగా... ఏడోసారి మరింత పవర్ ఫుల్ గా 7.4 తీవ్రతతో సంభవించింది.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ భూకంపాలు రష్యాలోని కమ్చట్కా ప్రావిన్స్ రాజధాని పెట్రోపావ్లోవ్స్క్ కమ్చట్కా కి తూర్పున మొదలయ్యాయి. ఈ సమయంలో ఫసిఫిక్ సముద్రంలోపల ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే హెచ్చరిక జారీ చేసింది.

అంతకుముందు, జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీ.ఎఫ్.జెడ్) రష్యాలోని కమ్చట్కా ప్రాంతం తీరానికి సమీపంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నివేదించింది. ఈ భూకంపం 10 కి.మీ లోతులో సంభవించిందని తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది!