Begin typing your search above and press return to search.

జూనియర్ జాతకంలో రాజకీయ యోగం ఉందా ?

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారి వంశంలో మూడవ తరం వెండి తెర కధానాయకుడు. కేవలం పదహారేళ్ళ ఏళ్ళ ప్రాయంలోనే సినీ రంగ ప్రవేశం చేసి మూడేళ్ళు తిరగకుండానే సూపర్ స్టార్ డం ని సొంతం చేసుకున్న మేటి ఘనాపాటి జూనియర్ ఎన్టీఆర్.

By:  Tupaki Desk   |   20 May 2025 8:30 AM
Jr NTR: The Torchbearer of a Legacy, Marching from Silver Screen
X

జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారి వంశంలో మూడవ తరం వెండి తెర కధానాయకుడు. కేవలం పదహారేళ్ళ ఏళ్ళ ప్రాయంలోనే సినీ రంగ ప్రవేశం చేసి మూడేళ్ళు తిరగకుండానే సూపర్ స్టార్ డం ని సొంతం చేసుకున్న మేటి ఘనాపాటి జూనియర్ ఎన్టీఆర్. అత్యంత ప్రతిభ జూనియర్ సొంతం.

మంచి డైలాగ్ డిక్షన్. మంచి కంఠంతో పాటు, అందమైన రూపం, పాత్రకు అవసరమైన గాంభీర్యం అలవోకగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే తీరు, అందరితో కలుపుగోలుగా మెలిగే వ్యక్తిత్వం ఇవన్నీ జూనియర్ కి పెట్టని ఆభరణాలు. ఇక నందమూరి వారి వంశీకులలో జూనియర్ కొంత సెపరేట్ అని చెప్పాలి. ఆయనలో లౌక్యం పాలు హెచ్చు. మిగిలిన వారిని భోళా మనుషులుగా చెబుతారు.

అందుకే జూనియర్ ఇంకా ఎక్కువగా రాణిస్తున్నారు అని అంటారు. మంచి క్రమశిక్షణ, వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత ఇవన్నీ జూనియర్ ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి అటు నుంచి గ్లోబల్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు జాతీయ స్థాయిలో తిరుగులేని నాయకుడుగా ఎదుగుతున్నారు. అంతర్జాతీయంగా తన ఖ్యాతిని విస్తరిస్తున్నారు.

తాజా పుట్టిన రోజుతో జూనియర్ వయసు అచ్చంగా 42 ఏళ్ళు నిండి 43వ ఏటకు అడుగుపెడుతున్నారన్న మాట. జూనియర్ ది రెండున్నర దశాబ్దాల సినీ రంగం అనుభవం అయినా ఇంకా మరో పాతికేళ్ళకు పైగా సినీ సీమని ఏలే సత్తా వయసు ఉన్నాయి. ఇక ఇపుడు ఆయన కెరీర్ పరంగా మంచి పీక్స్ లో ఉన్నారు ఆయన మాత్రమే చేయాల్సిన పాత్రలు అనేకం ఎదురుచూస్తున్నాయి.

ఆ విధంగా సినీ సీమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుని వేగంగా ముందుకు అడుగులు వేస్తున్న జూనియర్ తాతకు తగిన మనవడుగా అంతా చెప్పుకుంటారు. తాత నటనలోని మెలకువలను ఆ నటనా వైదుష్యాన్ని తన సొంతం చేసుకున్న జూనియర్ తాతలోని రాజకీయ కోణాన్ని కూడా పుణికి పుచ్చుకుంటారా అన్నదే కీలకమైన మౌలికమైన ప్రశ్నగా ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ 2009లో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఏపీలో ఎంతో ప్రచారం చేసి పెట్టారు. ఆ విధంగా రాజకీయాల్లో పాతికేళ్ళ ప్రాయనంలోనే ఆయన అడుగు పెట్టినట్లు లెక్క. అయితే సినీ రంగంలో తన భవిష్యత్తుని చూసుకుని ఆయన రాజకీయాలకు చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు.

అయితే జూనియర్ దూరంగా ఉన్నా ఆయన ఒంట్లో ఇంట్లో రాజకీయం ఉంది. ఆయన తాత ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ ఉండనే ఉంది. దాంతో జూనియర్ రాజకీయ రంగ ప్రవేశం మీద ఎప్పటికపుడు వార్తలు వేడిగా వాడిగా వస్తూనే ఉంటాయి అయితే వేటికీ జూనియర్ తానుగా స్పందించే అవకాశాలు అయితే లేవు ఆయనకు నిజానికి ఇపుడు ఆ అవసరం కూడా లేదు.

ఆయన సినీ సీమలో మరిన్ని అద్భుతమైన విజయాలను సాధించి లెక్కలేనన్ని రికారుడు సొంతం చేసుకున్న మీదటనే రాజకీయం వైపు చూస్తారని అంతా అనుకుంటున్నారు. ఇక చూస్తే జూనియర్ మహార్జాతకులు అని అంటారు. దానికి ఉదాహరణ పిన్న వయసులోనే అద్భుతమైన కెరీర్ ని అందుకోవడం. అచ్చం తాత పోలికలే కాదు ప్రతిభను కూడా సొంతం చేసుకున్న జూనియర్ ఎక్కాల్సిన మెట్లు చాలానే ఉన్నాయని అంటారు.

ఆయన రాజకీయాల్లోకి వస్తారా ఆయనకు రాజకీయ యోగం ఉందా అంటే కచ్చితంగా అన్న జవాబు వెన్నంటే ఉంటుంది. ముమ్మూర్తులా తాతను పోలిన జూనియర్ తాత సినీ రాజకీయ రంగాలు రెండింటిలోనూ తాను రాణించడం ఖాయమని అభిమానులు అంటారు. దానికి ఇపుడు సరైన సమయం కాదని అంటారు. ఆ సమయం వచ్చినపుడు తప్పకుండా జూనియర్ రాజకీయాల్లోకి వచ్చి తీరుతారని ఉన్నతమైన పదవులు కూడా అధిరోహిస్తారని వారంతా నమ్ముతారు.

జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల ఆయన దీక్షా దక్షతలు ఆయన నాయకత్వం లక్షణాలు ఆయన ముందు చూపు ఆయన ఆలోచనలు అన్నీ చూస్తే కనుక ఏదో నాటికి సీనియర్ ఎన్టీఆర్ మాదిరిగా జూనియర్ కూడా కోట్లాది తెలుగు ప్రజల కోసం సినీ సీమ నుంచి జన సీమకు తరలివస్తారనే అంతా అంటారు. మరి ఆ రోజు ఎపుడు ఏమిటి అన్నది కాలం చెప్పాల్సి ఉంటుంది. ఏది ఏమైనా జూనియర్ జాతకంలో రాజకీయ యోగం రాజయోగం ఉన్నాయా అంటే ఆయన జాతకం చూడకుండానే ఉన్నాయని ఎవరైనా ఠక్కున చెప్పగలరు. దానికి కారణం ఒకే ఒక్కటి, అక్కడ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్, ఆయన పట్టుదల సంకల్పమే ఏమైనా చేయిస్తుందని కూడా అంతా నమ్ముతారు.