Begin typing your search above and press return to search.

జోనాస్ బ్రో భార్య‌కు విడాకులిచ్చి మిస్ టీన్ ల‌వ్‌లో!

జో జోనాస్ - సోఫీ టర్నర్ తమ కెమిస్ట్రీతో కోట్లాది మందిని ఆశ్చర్యపరిచారు. వారు విడిపోయారని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 12:30 PM GMT
జోనాస్ బ్రో భార్య‌కు విడాకులిచ్చి మిస్ టీన్ ల‌వ్‌లో!
X

జో జోనాస్ - సోఫీ టర్నర్ తమ కెమిస్ట్రీతో కోట్లాది మందిని ఆశ్చర్యపరిచారు. వారు విడిపోయారని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇప్పుడు గాయకుడు జో జోనాస్ కొత్త ప్రేమ‌ను క‌నుగొన్నాడ‌నేది హాట్ టాపిక్.

పాపుల‌ర్ మిస్ టీన్ యుఎస్ఏ స్టార్మీ బ్రీతో అత‌డు ఇటీవ‌ల‌ సంబంధంలో ఉన్నట్లు సమాచారం. జో జోనాస్- స్టోర్మీ బ్రీ జంట కొలరాడోలోని ఆస్పెన్‌లో కలిసి కనిపించారు. వాస్తవానికి అతడు సోఫీ టర్నర్‌తో విడిపోయే ప్రాసెస్ సాగుతుండ‌గానే, అత‌డు అందాల రాణితో డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వచ్చాయి. హాలీవుడ్ టాబ్లాయిడ్ పేజ్ సిక్స్ కొలరాడోలోని ఆస్పెన్‌లోని హైలాండ్స్ అలెహౌస్‌లో స‌ద‌రు మోడ‌ల్ తో క‌లిసి ఉన్న ఫోటోను క్లిక్ చేసింది. ఆ ఇద్ద‌రూ బీరు తాగుతున్నారు. ఇద్దరు స్నేహితులు త‌మ‌ ముఠాతో కలిసి ఉన్నారని తెలుస్తోంది. అక్క‌డ ఈ జంట‌ కొంత విలువైన‌ సమయం కలిసి గడిపారు.

తాజాగా లీకైన ఫోటోల్లో .. జో జోనాస్ - స్టార్మీ లీ కలిసి చాట్ చేస్తున్నప్పుడు అందరూ స్మైలీగా ఉన్నారు. ఇద్దరు హాయిగా సౌక‌ర్యంగా క‌నిపిస్తున్నారు. కొలరాడోలోని ఆస్పెన్ స్కీయింగ్ రిసార్ట్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇద్దరూ స్కిస్‌లు ధరించి స్లోప్‌ల వైపు వెళుతుండగా కనిపించారు. ఆమె నల్లటి బాంబర్ జాకెట్ , స్కీ క్యాప్ స‌హా తెల్లటి ప్యాంటు ధరించింది. మరోవైపు అతను స్నో లెగ్గింగ్స్, మ్యాచింగ్ పఫర్ జాకెట్, గ్రే హెల్మెట్. గాగుల్స్‌లో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం ఇద్దరూ మెక్సికోలోని కాబో శాన్ లూకాస్‌లోని విమానాశ్రయంలో కనిపించారు. ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ కూడా అదే స‌మ‌యంలో మెక్సికన్ రిసార్ట్ పట్టణంలో క‌నిపించారు. సోఫీకి విడాకులిచ్చిన జో జోనాస్ ఇంత‌లోనే త‌న కొత్త ప్రియురాలితో షికార్లు చేయ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.