Begin typing your search above and press return to search.

ప్లేట్ లో అన్నం అడిగితే ఓకే.. జీవితంలో భాగం అడిగితే ఎలా?

అవును... తనపై వస్తోన్న ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జానీ భార్య అయేషా తాజాగా స్పందించారు.

By:  Tupaki Desk   |   21 Sept 2024 10:13 AM IST
ప్లేట్  లో అన్నం అడిగితే ఓకే.. జీవితంలో భాగం అడిగితే ఎలా?
X

ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న విషయాల్లో సినీ కొరియోగ్రాఫర్ జానీ వ్యవహారం ఒకటనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు కీలక విషయాలను రాబట్టారని అంటున్నారు. ఈ సమయంలో జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా పైనా బాదితురాలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో అయేషా స్పందించారు.

అవును... తనపై వస్తోన్న ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జానీ భార్య అయేషా తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా... తన ప్లేట్లో అన్నం కోసం వస్తే ఓ ముద్ద అన్నం పెడతాను కానీ.. నా జీవితంలోకే వస్తానంటే నేను చోటు ఎందుకు ఇస్తాను అని స్పందించారు. ఆమెనే... నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని తన భర్త జానీని ఒత్తిడి చేసిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యి ఉండి, ఒక అమ్మాయిని సెక్స్యువల్ హెరేస్మెంట్ చేస్తారంటే ఎలా నమ్ముతున్నారు? అంటూ అయేషా స్పందించారు. ‘నిజంగా నేను అలా చేస్తే, రేపు ఆ అమ్మాయి బయటకు వెళ్లి చెబితే జనం ఏమనుకుంటారు’ అనే ఆలోచన ఆయనకు అయినా ఉండి ఉంటుంది కదా అని ఆమె రియాక్ట్ అవుతున్నారు.

ఇదే సమయంలో... ఇద్దరి ప్రమేయం లేకుండా ఏమీ జరగదని చెప్పిన అయేషా... 16ఏళ్ల వయసు నుంచి తనకు ఇలా జరుగుతుందని ఆమె చెబుతుందని... తనకు తెలిసి ఆమె 18 ఏళ్లు నిండిన తర్వాతే ఇండస్ట్రీకి వచ్చిందని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. ఇక సెక్సువల్ హెరేస్మెంట్ అనేది అబ్బాయిల తరుపు నుంచే కాదని.. అమ్మాయిల వైపు నుంచి కూడా జరుగుతుంటుంది అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాకపోతే అబ్బాయిలు ఈ విషయాన్ని బయటకు చెప్పరని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక తాను జానీతో 14 ఏళ్లుగా కాపురం చేస్తున్నానని.. ఆయనకు - ఆమెకు పెళ్లి అయితే ఆ విషయం తనకు తెలియకుండా ఉంటుందా అని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఆ అమ్మాయి తనకు తానే కావాలని ఇస్లాం లోకి మారిందని.. అందుకు ఎవరూ ఒత్తిడి తేలేదని అయేషా చెప్పుకొచ్చారు.