Begin typing your search above and press return to search.

మోడీ వంటి నాయకుడు యూఎస్ లో ఉంటే... జాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇదే క్రమంలో పలు విదేశీ కంపెనీల సీఈఓ లలో కూడా మోడీ ఫాలోవర్స్ ఉన్నారని కథనాలొస్తుంటాయి.

By:  Tupaki Desk   |   29 Feb 2024 4:15 AM GMT
మోడీ వంటి నాయకుడు యూఎస్  లో ఉంటే... జాన్  ఆసక్తికర వ్యాఖ్యలు!
X

ప్రపంచ దేశాల్లో భారత ప్రధాని మోడీకి ఫుల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాధినేతల్లో చాలా మంది ఆయనకు ఫ్యాన్స్ గా ఉన్నారని కూడా చెబుతుంటారు. ఇదే క్రమంలో పలు విదేశీ కంపెనీల సీఈఓ లలో కూడా మోడీ ఫాలోవర్స్ ఉన్నారని కథనాలొస్తుంటాయి. వారిలో ప్రధానంగా సిస్కో మాజీ సీసీఓ జాన్ ఛాంబర్స్ ఒకరు! భారత్ లో ఎన్నికల వేళ మోడీని ఆకాశానికి ఎత్తేవారిలో ఈయన ఒకరన్ని అంటుంటారు!

అవును... మోడీని అమెరికా టెక్ దిగ్గజ సంస్థ సిస్కో మాజీ సీఈఓ జాన్ మరోసారి మోడీపై ప్రశంసల జల్లులు కురిపించారు. ఇందులో భాగంగా... ప్రపంచంలోని అత్యుత్తమ నాయకుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకరని జాన్ కొనియాడారు. అసలు మోడీ వంటి నాయకుడు అమెరికాలో ఉండి ఉంటే బాగుంటుందని తెలిపారు. ఇలాంటి నేతలు అరుదుగా ఉంటారని అన్నారు!

ఇదే సమయంలో... నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ దూసుకెళుతోందని జాన్ అభిప్రాయపడ్డారు! ఇదే సమయంలో దశాబ్ధ కాలంలో చైనాను భారత్ అధిగమిస్తుందని జోస్యం చెప్పారు. కాగా... జాన్ ప్రస్తుతం యూఎస్ – భారత్ స్ట్రాటజిక్ ఫోరం ఛైర్మన్ గా ఉన్నారు.

కాగా... మోడీని బాగా అభినందించే వారిలో జాన్ ఎప్పుడూ ముందుంటారని అంటుంటారు. 2018లో అప్పటికి మాజీ కాని సిస్కో సీఈఓ జాన్... వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఎన్నుకోకపోతే భారతదేశ అభివృద్ధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే బలమైన వృద్ధిని కలుపుకొని పోయే దేశంగా ఇండియా అవతరించే అవకాశం ఉందని చెప్పారు.

ఇదే సమయలో అది అలా జరగడానికి కనీసం ఒక దశాబ్ధం పడుతుందని.. భారత ప్రధాని మోడీకి అది చేయగల సత్తా ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి... ఇంకో దశాబ్ధ కాలంలో భారత్, చైనాను అదిగమిస్తుందని.. మోడీ వల్లే అధి సాధ్యమవుతుందన్నట్లుగా చెబుతున్నారు. పైగా... ఆ అవకాశం మోడీకి ఇవ్వకపోవడం పెద్ద ప్రమాదం అని తాను భావిస్తున్నట్లు జాన్ చాంబర్స్ చెప్పడం గమనార్హం.

దీంతో భారత్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాన్ ఎంట్రీ మేండేటరీ అయిపోయిందనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తుంటాయి!!