Begin typing your search above and press return to search.

జోగ‌య్య‌.. జ‌న‌సేన విశ్వ‌సనీయ‌త‌కు ఇంత దెబ్బ‌కొట్టిందా..!

జ‌న‌సేన‌ లో క‌ల‌క‌లం రేగింది. మాజీ ఎంపీ.. కాపు సంక్షేమ సేన వ్య‌వ‌స్థాప‌కుడు.. చేగొండి హ‌రిరామ జోగయ్య రాసిన బ‌హిరంగ లేఖ‌ తో పార్టీలో ఒక్క‌ సారిగా కుదుపు ఏర్ప‌డింది.

By:  Tupaki Desk   |   23 Dec 2023 4:30 PM GMT
జోగ‌య్య‌.. జ‌న‌సేన విశ్వ‌సనీయ‌త‌కు ఇంత దెబ్బ‌కొట్టిందా..!
X

జ‌న‌సేన‌ లో క‌ల‌క‌లం రేగింది. మాజీ ఎంపీ.. కాపు సంక్షేమ సేన వ్య‌వ‌స్థాప‌కుడు.. చేగొండి హ‌రిరామ జోగయ్య రాసిన బ‌హిరంగ లేఖ‌ తో పార్టీలో ఒక్క‌ సారిగా కుదుపు ఏర్ప‌డింది. దీం తో హుటాహుటిన అలెర్ట్ అయిన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పార్టీ కాపు నాయ‌కుల‌ తో భేటీ అయ్యారు. ఈ బ‌హిరంగ లేఖ‌పై చ‌ర్చించారు. కాపుల‌ ఓట్లు కీల‌క‌మ‌ని భావిస్తున్న స‌మ‌యంలో జోగ‌య్య రాసిన లేఖ‌.. పార్టీ విశ్వ‌స‌నీయ‌త పైనే ప్ర‌భావం చూపిస్తోంద‌ని ప‌లువురు నాయ‌కులు చెబుతున్నారు.

'క్షేత్ర‌స్థాయి లో ఓట‌ర్ల‌ను పార్టీవైపు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాం. ఇలాంటి స‌మయంలో మాకు అండ‌గా ఉండాల్సిన పెద్దాయ‌న ఇలా రోడ్డున ప‌డ‌డం దారుణం. దీనిపై మేం దృష్టి పెట్టాం.మాకు తెలిసి.. ఈ లేఖ పెద్ద‌గా ప్ర‌భావం చూపిస్తుంద‌ని అనుకోవ‌డం లేదు. అయినా.. కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని అంచ‌నా వేస్తున్నాం' అని జ‌న‌సేన కీల‌క నాయ‌కుడు ఒక‌రు చెప్పారు. మ‌రోవైపు.. జోగ‌య్య లేఖ ప్ర‌భావం కాపుల్లో భారీగా క‌నిపిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ముఖ్యంగా ఒక్క సీఎం సీటునేకార్న‌ర్ చేయ‌డం కాకుండా.. జ‌న‌సేన విశ్వ‌స‌నీయ‌త‌నే జోగ‌య్య కార్న‌ర్ చేశార‌నేది క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. జ‌న‌సేన పార్టీని పెట్టింది.. ఒక మార్పు, ఒక సంచ‌ల‌నం కోస‌మ‌ని.. భావిస్తున్న‌యువ‌త‌రం.. ఇప్పుడు జోగ‌య్య లేఖ‌ తో జ‌న‌సేన పార్టీ పై అభిమానం కూడా స‌న్న‌గిల్లే ప్ర‌మాదం ఏర్పడింద‌ని అంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.. ఎన్ని రాజ‌కీయాలు చేసినా.. అస‌లు ల‌క్ష్యం ఏంట‌నేదే ఎన్నిక‌ల్లో ఓట్లు రాలేందుకు ప్రామాణికంగా మారుతుంద‌ని అంటున్నారు.

అయితే..ఈ విష‌యంలో జ‌న‌సేన అనుకున్న ల‌క్ష్యం సాధించ‌డంలో వెనుక బ‌డింద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. దీనికి జోగ‌య్య లేఖ కూడా మ‌రింత ఆజ్యం పోసింద‌ని.. దీనిలో వాస్త‌వం ఏంట‌నేది.. జ‌న‌సేన అధినేత నేరుగా బ‌య‌ట‌కు వ‌చ్చివివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. లేక‌పోతే.. పార్టీ విశ్వ‌స‌నీయ‌త‌పై మ‌రింత ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో పార్టీలు, నాయ‌కుల‌తో పాటు విశ్వ‌స‌నీయ‌త కూడా అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.