Begin typing your search above and press return to search.

పరీక్షల్లో కాపీ కొడితే 10 కోట్లు జరిమానా... అసెంబ్లీలో బిల్లు ఆమోదం!

ఈ మధ్య కాలంలో పోటీ పరీక్షల్లో కాపీయింగ్ కి పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Aug 2023 7:45 AM GMT
పరీక్షల్లో కాపీ కొడితే 10 కోట్లు జరిమానా... అసెంబ్లీలో బిల్లు ఆమోదం!
X

ఈ మధ్య కాలంలో పోటీ పరీక్షల్లో కాపీయింగ్ కి పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే.. ఈ కాపీయింగ్ కోసం రకరకాల టెక్నాలజీ ఎత్తులను వేస్తున్నారు. దీంతో పోటీ పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా కఠిన చట్టం తీసుకురావాలని ఫిక్సయ్యింది జార్ఖండ్ ప్రభుత్వం.

అవును... పోటీ పరీక్షల్లో కాపీయింగ్‌ జరగకుండా కఠిన చట్టం తీసుకొచ్చే క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ సంచలనాత్మక బిల్లును ఆమోదించింది. ఇకపై పరీక్షల్లో కాపీ కొట్టి పట్టుబడితే 10 కోట్ల రూపాయల జరిమానాతో పాటు.. జీవిత కాలం జైలు శిక్ష కూడా విధించేలా చట్టాన్ని రూపొందించి అమలు చేయనుంది.

జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అలాంగిర్ అలాం ఈ యాంటీ చీటింగ్ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ సమయంలో ఈ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఇకపై ఎవరైనా పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడితే వారికి 10 కోట్లు జరిమానా తోపాటు జీవితకాలం ఖైదు చేసే విధంగా చట్టాన్ని రూపొందించారు.

ఈ బిల్లుపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా.. ఇది చాలా కఠినమైన బిల్లు అన్ని విమర్శలు రాగా... దీనిపై ప్రభుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆయా నియామకాలకు సంబంధించి జరిగే కాంపిటీటివ్ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

ఇదే సమయంలో పరీక్షల నిర్వహణలో అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న లొసుగులను సద్వినియోగం చేసుకుంటూ ఇంతకాలం కొందరు అభ్యర్థులు పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డారని.. అందుకే ఈ తరహా కఠిన చట్టాలను రూపొందించాలని నిర్ణయించినట్లు జార్ఖండ్ ప్రభుత్వం చెబుతోంది.

ఇదే క్రమంలో ఈ బిల్లుపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ స్పందించారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో చట్టాలను ఎలా తయారు చేస్తోందో అందరూ చూస్తున్నారని.. ఇలాంటి చట్టం చేయడం ఇదే మొదటిసారి కాదని.. మరికొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు.

అయితే జైలు శిక్ష విషయంలో సవరణలు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మాల్ ప్రాక్టీస్ చేస్తూ మొదటిసారి పట్టుబడితే ఏడాదిపాటు.. రెండోసారి పట్టుబడితే మూడేళ్లపాటు జైలు శిక్ష ఉండేలా సవరణలు చేసినట్లు తెలిపారు.